Suryaa.co.in

Andhra Pradesh

బీ ట్యాక్స్‌, అధికారం పోతోందన్న ఉక్రోశం

-బూతు బ్రహ్మనాయుడికి ప్రజలే బుద్ధి చెబుతారు
-లావు, మక్కెన గురించి మాట్లాడే అర్హత ఉందా?

-శునక గర్జనతో ఏం సాధించాలనుకుంటున్నావు?
-హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించావు
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హితవు
-అభివృద్ధి, అక్రమాలపై చర్చకు మక్కెన సవాల్‌

బూతు బ్రహ్మనాయుడు తీరు మార్చుకోకపోతే ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. నిజంగా అంత దమ్ముంటే, నిజాయతీగా పనిచేశామన్న ధైర్యం ఉంటే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హితవుపలికారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుపై బొల్లా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బొల్లా ప్రతి మాటలో బూతులతో పాటు బీ టాక్స్‌ పోతోందన్న బాధ, అధికారం దూరం అవుతోం దన్న నిరాశ, నిస్పృహలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 70 ఏళ్లు పైబడటమే కాదు విద్యా సంస్థలు కూడా నడుపుతున్న బొల్లా ఈ శునక గర్జనలతో ఏం సాధించాలని అనుకుంటున్నారో చెప్పాలని దుయ్యబట్టారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే లావు, మాజీ ఎమ్మెల్యే మక్కెన గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా అని నిప్పులు చెరిగారు.

డిల్లీ ఎన్నో ఆఫీసులు తిరిగి వరికపూడిశెల ఎత్తిపోతలకు అన్ని అనుమతులు తెచ్చిన లావు ఎక్కడ? ఆ ప్రాజెక్టుకు ఎక్కడ కడుతున్నారో కూడా తెలియని నీవెక్కడ అంటూ ప్రశ్నించారు. గుండ్లకమ్మపై తంగి రాల డ్యామ్‌ నిర్మిస్తానని చెప్పి మోసం చేశారని…అక్కడ డ్యామ్‌ కాదు కదా చెక్‌డ్యామ్‌ ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేసిన బొల్లా 14 కళాశాలలు తీసుకొస్తానని చెప్పి.. ఒక్కటీ కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. వినుకొం డను పారిశ్రామిక వాడ చేయడం కాదుకదా ఐదేళ్లలో ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. గోదావరి-పెన్నా అనుసంధానం గురించి ఏనాడైనా బొల్లా ఏనాడైనా మాట్లాడారా? నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆయనకు ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యే బొల్లా బూతు పురాణంపై ఎన్నికల సంఘానికి తప్పక ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 6న వినుకొండలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అభివృద్ధి, అరాచకాలపై చర్చకు సిద్ధమా?
మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బొల్లా చేసిన అభివృద్ధి ఏమిటి? చేసిన అరాచకాలెన్ని? అన్న విషయంపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నా రు. వినుకొండకు తీసుకువస్తానన్న ముస్లీం, మైనార్టీలకు కళాశాల ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. తనపై బురద జల్లడమే తప్ప నిజాలు లేవన్నారు. తప్పు చేసి ఉంటే కేసు పెట్టి జప్తు చేయించవచ్చు కదా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి చేపల చెరువులను లీజుకు తీసుకొని నడుపుతున్నామని, ఎక్కడా వివాదాలు, కేసులు లేవని, ఆయనకు తనపై ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు. లారీ డ్రైవర్‌గా, సినిమాలు వేసుకునే బొల్లా అపర కోటేశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వా త ఎమ్మెల్యే బొల్లాకి చెందిన వెయ్యి ఎకరాల్లో ఏముందో, తన 50 ఎకరాల్లో ఏముందో, ఆంజనేయులు 50 ఎకరాల్లో ఏముందో బ్రహ్మాండగా సర్వే జరుగుతుందని, అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయని తేలితే పేద ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్‌, తెలుగుదేశం నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, షమేం ఖాన్‌, పత్తి పూర్ణచంద్రరావు, బెల్లంకొండ సైదులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE