Home » చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ సజ్జలకు లేదు

చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ సజ్జలకు లేదు

-జగన్ అంటే అహంకారం..విధ్వంసం..దోపిడీ
-విధ్వంసం, దోపిడీనే తన జీవితాశయంగా జగన్ పెట్టుకున్నారు
-జగన్ లాంటి బందిపోటును తరికొట్టేందుకు జనం ఏకమవ్వాలి?
-వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీచానికి పాల్పడున్నారు
-సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-రాష్ట్రంలో అరాచకాలను నిరసిస్తూ లక్ష్మీ అనే మహిళ ఢిల్లీలో బొటనవేలు నరుక్కుంది
-కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
-జగ్గంపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

జగ్గంపేట : ఆడబిడ్డలు యుద్ధానికి సిద్ధమా? 4,500 టీ టైం పాయింట్లతో 20వేల ఉద్యోగాలు కల్పించిన అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్. 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలాకాసి ఆధరించిన నాయకుడు నెహ్రు. జగ్గం పేట ప్రజల ఉత్సాహంతో ఉన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు సభలకు వస్తున్నారు. 41 సభలు పూర్తి చేసి నేడు ఇక్కడికి వచ్చాను. ఎన్నికలు నామమాత్రమే గెలవబోయేది కూటమి అభ్యర్ధులే. ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. మార్పు వేవ్ గా మారి వైసీపీ కొట్టుకొని పోవడం ఖాయం.

గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మీ అనే మహిళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని పీఎం, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తులకు తెలియజేయడానికి ఢిల్లీలో నిరసన తెలియజేసింది. గంజాయిని చిన్న పిల్లలతో అమ్మించి నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు. భూ కబ్జాలతో దోచుకున్నారని ఎంత మందిని చెప్పినా పట్టించుకోకపోవడంతో ఢిల్లీకి వెళ్లి బొటన వేలు కోసుకుంది. అదే విధంగా రాక్షసులతో ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో. రేపు మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి.

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ స్టార్ సజ్జలకు లేదు
జగన్ రెడ్డి ఏనాడైనా సేవాభావంతో పని చేశారా? ఒక అహంకారం, విధ్వంసం, దోపిడీ విధానాలే జీవిత ఆశయంగా పని చేశారు. దేవుడి కంటే గొప్పవాడు అనే విధంగా జగన్ ఉన్నారు. ప్రజలు భానిసలు అనుకుంటున్నారు. అసలే కోతి కల్లి తాగి ముళ్లు కొట్టిన విధంగా జగన్ ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్లుగా కలవలేదు. అహంకారానికి తోడు ఉన్న సైకో జగన్.

ఆయన చేతిలో రాయితో తల్లిని, చెల్లిని, మనల్ని కొట్టి ఆఖరికి తనకు తానే కొట్టుకునే పరిస్థితి. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన వ్యక్తి. ఆయనకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. రాజమౌళి బాహుబలి సినిమా తీసి ప్రపంచానికి చాటిన వ్యక్తి. పక్కనే ప్రభాస్ కూడా ఉన్నారు. ఇలాంటి పెద్దలను ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు జగన్. సాక్షి ఆఫీస్ లో గుమస్తాగా పని చేసిన వ్యక్తి బ్రోకర్ సజ్జల కూడా చిరంజీవిని విమర్శిస్తున్నారు.

పవన్ కాలిగోటికి కూడా జగన్ సరిపోడు
వైసీపీ నాయకులు అహంకారంతో కొట్టుకుంటున్నారు. వారి అహంకారాన్ని దించే ఆయుధం ప్రజల దగ్గర ఉంది. దళితుడిని చంపి డోర్ డెలివరి చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టారు. చివరికి ఆయన తట్టుకోలేక నా పెళ్లాలా గురించి మాట్లాడతావా.. నువ్వు కూడా వచ్చి నాతో కాపురం చేయమని జగన్ కి బుద్ధి చెప్పారు. మేమెప్పుడైనా మీ భార్య విషయం మాట్లాడామా? మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడామా? కాని మీరు మాత్రం అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులపై మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ ఎక్కడ? సైకో జగన్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అవసరం లేదు. ఆయన పవర్ స్టార్ ఏ సినిమాలో నటించినా డబ్బులు వస్తాయి. అలాంటి వ్యక్తి కాలి గోటికి కూడా సరిపోడు జగన్.

మద్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్ ఎందుకు లేదు?
జగన్ చేతిలో నేను బాధితుడునే. 40 ఏళ్లుగా నేనెంటే చాలా మంది భయపడతారు. కాని జగన్ సైకో కాబట్టి భయపడలేదు. రఘురామకృష్ణం రాజును పోలీసులతో దాడి చేయించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ పని చేయడం లేదు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ఏ వ్యవస్థ పని చేయడం లేదు. పోలవరం, అమరావతిని నాశనం చేశారు. న్యాయమూర్తులను తిట్టే వాళ్లను, సిబిఐ కేసుల్లో ఉన్న వారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్న వ్యక్తి ప్రవర్తన గురించి ప్రజలు ఆలోచించుకోవాలి.

రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నారు. పెరుగు, మీగడ మింగేసి ప్రజలకు నీళ్ల మజ్జిగ పంచుతున్నారు. నాశిరకం జే బ్రాండ్ తో ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. గతంలో రూ.60 క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అంటే రూ.140 ప్రజల డబ్బులు జలగలా మింగేస్తున్నారు. ఏ బ్రాంది షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయా? టీ కొట్లో, తోపుడు బండ్లకు సైతం ఆన్ లైన్ ఉంటే మద్యం షాపుల్లో మాత్రం ఎందుకు పెట్టలేదు.

జగన్ లాంటి బందిపోటు దొంగను తరికొట్టేందుకు ఏకమవ్వాలి
మద్యపాన నిషేదం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని హామీనిచ్చాడు చేశాడా? ప్రత్యేకహోదా వచ్చిందా? సీపీఎస్ రద్దు చేశాడా? కరెంట్ చార్జీలు తగ్గించాడా? 9 సార్లు విద్యుల్ చార్జీలు పెంచారు. టిడిపి హయాంలో ఏనాడు కరెంట్ చార్జీలు పెరగలేదు. జాబ్ క్యాలెండర్ పెట్టాడా? డీఎస్సీ ఇచ్చాడా? కూటమి వచ్చిన వెంటనే డిస్సీపై తొలి సంతకం పెడతాను. ఒక దొంగ, దోపిడీదారుడు మీ ఇంటి మీదకు వస్తే ఏం చేస్తారు? ఊరంతా ఒకటై దొంగను తరుముతారు. బందిపోటు దొంగ వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అతని చేతుల నుంచి రాష్ట్రాన్ని కాపడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

బీజేపీ, టిడిపి, జనసేన పార్టీలు ప్రజలు గెలవటం కోసమే. మళ్లీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను. అన్ని వర్గాలకు మ్యానిఫెస్టో ఇస్తాం. సూపర్ సిక్స్ లో ఆడబిడ్డలకు మహా శక్తి కింద నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నారు. ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి ఐదేళ్లల్లో రూ.90వేలు ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది విద్యార్ధులంటే అందరికి రూ.15వేలు ఇస్తాం. ఆంక్షలు లేకుండా పూర్తిగా ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం.

సాగు నీటికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
యువగళంతో రూ.3వేల నిరుద్యోగ భృతి, 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. టిడిపి, జనసేన పార్టీలకు సంపద సృష్టించడం తెలుసు, దోపిడీ తెలిసిన పార్టీ వైసీపీ. అన్నదాతను ఆదుకుంటాం. రూ.20 వేలు ఏడాదికి ఇస్తాం. సాగు నీరుకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తాం. మొదటి తారీఖున వాలంటీర్లు కాకుండా సచివాలయం ఉద్యోగులతో ఇంటింటికి ఫింఛన్ ఇవ్వాలి. ఏప్రిల్ నుంచి ఇంటి దగ్గరే రూ.4వేలు ఫింఛన్ ఇస్తాం. రూ.200 నుంచి రూ.2000 ఫింఛన్ పెంచిన పార్టీ టిడిపి. జగన్ రెడ్డి ఇళ్ల పేరుతో గూడు కట్టారు. ప్రతి ఒక్క పేదవాడికి ఇంటిని అందిస్తాం.

జాబు రావాలంటే కూటమి రావాలి
పారిశ్రామిక వేత్తగా సత్తాను చాటిన వ్యక్తి. అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రు…పోరాట యోధుడు. మంచి వ్యక్తిని ఆదరించకపోతే ఉపయోగం లేదు. త్యాగల నాడు రావడానికి కారణం నెహ్రు. పుష్కర, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను తెచ్చింది నెహ్రు. అన్ని ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు పూర్తి చేస్తాం. విద్యకు ప్రాధాన్యం ఇస్తాం. మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలు అందిస్తాం. జాబు కావాలంటే కూటమి రావాలి, గంజాయి కావాలంటే వైసీపీ రావాలి. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. మీ ఫోన్ లో క్యాలిక్యులేటర్ తీసుకొని మేము చెప్పిన పథకాలతో బాగుపడతారా? జగన్ మాయ మాటలతో బాగుపడతారో లెక్క వేసి చూసుకోండి.’’ అని చంద్రబాబు అన్నారు.

Leave a Reply