-నల్లగొండ జిల్లాలో మున్సిపల్ అధికారుల నిర్వాకం
-నందికొండ నాగార్జునసాగర్‌లో వెలుగుచూసిన ఘటన
-కొన్నిరోజులుగా వాటర్ ట్యాంకులోనే కళేబరాలు
-వ్యాధుల ఆందోళనలో ప్రజలు
కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేసిన వైనం నల్గొండ జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. నందికొండ నాగార్జున సాగర్ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు ఉన్నాయి. అవి వాటిలో జారిపడి మృతి చెందినట్లు తెలుస్తుంది. అవే నీటిని ఎన్‌ఎస్‌పీ అధికారుల గత కొన్ని రోజులుగా వాటినే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. వాటినే ప్రజలు తాగుతున్నారు. వాటర్ ట్యాంకుపై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతిచెందినట్లు సమాచారం. 30 నుంచి 40 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి.