Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్లు

– ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం
– ప్రజా ప్రయోజనాల కోసమే కూటమి
– సమన్వయ సమావేశంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

ప్రజా ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిరదని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-బీజేపీ కార్యకర్తల సమావే శానికి డాక్టర్‌ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒక స్వచ్ఛభారత్‌, మేకింగ్‌ ఇన్‌ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోదీ వచ్చిన తర్వాతే సాధ్యమయ్యాయి. చట్ట సభలో తన బలమైన గళం వినిపిస్తున్నప్పుడు మోదీని చూసి మేమంతా చాలా గర్వపడ్డాం. దేశ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడిరది. ఈ సమావేశం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలని, అందరితో కలిసి నడవాలని ఉద్దేశం మాకు బలంగా ఉందని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్లు. ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం. కానీ జగన్‌కు మాత్రం ఏ అంటే ఆపడం, ‘పీ’ అంటే పడగొట్టడం మాత్రమేనని విమర్శించారు. పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ నేడు భారతదేశం ఉన్నత స్థితిలో ఉండడానికి నరేంద్ర మోదీనే కారణం. నాకు వచ్చిన ఈ అవకాశానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వల్లూరు జయ ప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 7 లక్షల ఇళ్లకు డబ్బులు వసూలు చేసిన జగన్‌ ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేకపోయిందన్నారు. పెమ్మసాని కోసం పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా వైపు నుంచి ఏమైనా లోపాలు జరిగితే సరిదిద్దుకుంటామన్నారు.

మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడు తూ రామరాజ్య స్థాపనకు పెమ్మసాని, గళ్లా మాధవికి అవకాశం దక్కిందని ఇరువురూ కలిసి చక్కని మార్గంలో అవకాశం ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE