ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని
శుక్రవారం ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగా వెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో డిప్యూటీ సీఎం వాహనంలో నగదు, విలువైన వస్తువులేమీ లభించ లేదని, తనిఖీలకు డిప్యూటీ సీఎం పూర్తిగా సహకరించారని అధికారులు తెలిపారు.