– 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు
(వెంకట్)
భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహా సముద్రం లాంటిదని అమెరికా లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014 లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్‌ను సమర్పించారు.
భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపలి ఈ మహా సముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు ఉన్నదని వీరు గుర్తించారు. రింగ్‌వుడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాతి ఉపరితలంలో ఈ నీరు ఉన్నట్టు వీరు చెప్తున్నారు. ఈ రాయిని బ్లూరాక్ అని కూడా పిలుస్తారు. ఈ రాయి స్పాంజి లాంటి స్వభావంతో ఉంటుందని, నీటిని పీల్చుకోవడం దీని ప్రత్యేకత అని, ఇది హైడ్రోజన్‌ను ఆకర్షించి, నీటిని అదిమి పట్టుకుంటుందని పరిశోధకుల బృందంలో ఒకరైన స్టీవ్ జాకబ్‌సన్ తెలిపారు..