– సాయిబాబా అవైదికం, అపౌరాణికం, అధార్మికం అన్న ఆలోచన హిందువులకు రావాలి
– సాయి పదానికి వైదిక, పౌరాణిక మూలాలు లేవు
– సాయి ముస్లీమ్ ఫకీర్కు వాడబడే మాట
ఓం సాయి
“సాయిబాబా” అంటున్నప్పుడు ‘ఫకీర్ – తండ్రి’ అన్న అర్థం వస్తుంది. ఇది పూర్తిగా అవైదికం. అవైదికమైన సాయిబాబాకు ‘ఓం’ ను కలపడం వైదికాన్ని మలినం చెయ్యడమే.
‘ఓం’కు సాయి లేదా సాయిబాబాను చేర్చడం పెను కల్తీ. ‘ఓం సాయి’, ‘ఓం సాయిరాం’ వంటివి వైదికానికి జరుగుతున్న మహా అపచారం. సాయిబాబా అవైదికం, అపౌరాణికం, అధార్మికం అన్న ఆలోచన, ‘చదువు’, విజ్ఞత హిందువులకు రావాలి.
ఓం అంటే ప్రణవం. “తస్య వాచకమ్ ప్రణవమ్” అని పతంజలి యోగసూత్రాల్లో (సూత్రం 27) చెప్పబడింది. అంటే బ్రహ్మన్కు లేదా బ్రహ్మంకు పేరు ప్రణవం అని అర్థం. “మంత్రాణామ్ ప్రణవశ్శిరః” అని ప్రణవం లేదా ఓం కారం గురించి చెప్పబడ్డది. అంటే మంత్రాలకు ఓం కారం శిరస్సు అని.
సాయి అనడం వైదిక మంత్రమూ కాదు, వైదిక నామమూ కాదు. సాఈ (సాయి) పదానికి వైదిక, పౌరాణిక మూలాలు లేవు. సాయి ముస్లీమ్ ఫకీర్కు వాడబడే మాట. (ఈ విషయంగా అసత్యాలకు, అజ్ఞానానికి అతీతంగా సరైన వివరణ వ్యాసం 2లో ఇచ్చాను)
‘ఓం సాయి’… ఈ మాట ఒక వైపరీత్యం. ఒక వికారం. ‘సాయిరాం’ అనడమూ ఒక వికృతమే. ‘రామ’ అనేది ఒక పౌరాణిక శబ్దం. ఆ రాం శబ్దానికి ఇస్లామిక్ సాయి పదాన్ని కలపడం ఏమిటి? మళ్లీ దానికి ఓం కారం కలపడం మహా అపచారం; సనాతన, హైందవ ద్రోహం. నిర్ద్వంద్వంగా సా(ఈ)యి వైదిక బ్రహ్మం దైవం కాదు. అలాంటప్పుడు “ఓం సాయి” అనడం వైదిక ద్రోహం.
ఒక మంత్రానికి శిరస్సు అని ఓం కారం శాస్త్రోక్తమైనాక దాన్ని అవైదిక లేదా ముస్లీమ్ సా(ఈ)యికి కలపడం అత్యంత వైదిక ద్రోహం. ‘ఓం సాయి’, ‘ఓం సాయిరాం’ వంటివి వైదిక విరోధమైనవి. అవి అసనాతనం. ఆలోచిద్దాం… సాయికి ఓం కారానికీ, సాయికి వైదికానికీ, సాయికి సనాతనానికీ ఏ సంబంధమూ లేదు.
సాయిబాబా అవైదికం, అపౌరాణికం, అసనాతనం.
ఓం సాయి అంటూనూ, సాయిబాబాతోనూ మన వైదికత్వాన్ని , సనాతనత్వాన్ని మలినం, కల్తీ చేసుకోవడం, భ్రష్టుపట్టించుకోవడం మానుకుందాం.
సాయిబాబా అన్న భయంకరమైన కల్తీని తొలగించుకుని, సనాతనాన్ని లేదా వైదికాన్ని లేదా హైందవాన్ని మనం శుభ్రం చేసుకుని నిలబెట్టుకుందాం.
“సాయిబాబా కల్తీ మనకు వద్దు; వద్దు; వద్దు;
సాయిబాబా కల్తీతో మనం హైందవాన్ని కోల్పోవద్దు”
– రోచిష్మాన్
9444012279