ఎప్పుడైనా మన రాష్ట్ర లేదా దేశ చరిత్రలో ఇలా ఒక క్యాలెండర్ ప్రకటించడం మనం చూశామా?
కచ్చితంగా లేదు!
ఇది కేవలం చంద్రబాబు ఫేస్ వాల్యూ చూసి పెట్టుబడులు పెట్టే వారి కోసం ఇచ్చిన ‘ఉద్యోగాల క్యాలెండర్’ కాదు. ఇది 25 తాగు, సాగు మరియు పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించి జలర్షి పెట్టిన ముహూర్తాలు.
సాగునీటి ప్రాజెక్టులంటే — పిలిచిన చోటల్లా వెళ్లి రాష్ట్రమంతా శంకుస్థాపన రాళ్లను బండెడు వేయడం, దశాబ్దాల నిరీక్షణ, అసంపూర్తిగా మిగిలిన పనులు, ఏళ్ల తరబడి సాగే ఫైళ్ల కదలికలు మాత్రమే అని ఈ దేశానికి తెలుసు. కానీ, అమరావతిలో జరిగిన 7వ కలెక్టర్ల సదస్సు సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం భారత సాగునీటి రంగంలోనే ఒక చరిత్ర.
భగీరథుడు తన పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించడం కోసం స్వర్గంలోని గంగను భూమికి తీసుకురావడానికి రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి సాధించడం పౌరాణిక గాథ. కానీ, ఇది భూమిపై గోదావరిని, కృష్ణమ్మను మొదటిసారి కలిపిన “జలర్షి” సంకల్పం మరియు పట్టుదల. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే వాగ్దానాల కంటే ఎంతో శక్తివంతమైనది ఈ “ఇరిగేషన్ క్యాలెండర్”. ఎందుకంటే, ఇది కేవలం రాజకీయ మాట కాదు… ఒక పక్కా అడ్మినిస్ట్రేటివ్ డెడ్లైన్!
ఎందుకు ఇది దేశానికే ఒక సరికొత్త పాఠం?
పాలనలో పారదర్శకత: 25 ప్రాజెక్టులు, వాటికి కచ్చితమైన పూర్తి తేదీలు! ఇలా ప్రకటించడం ద్వారా ప్రభుత్వం తన జవాబుదారీతనాన్ని ప్రజల ముందు పెట్టింది.
మొదటిసారి ఒక సాహసం: భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రాజెక్టుల పూర్తికి ఇలా బహిరంగంగా క్యాలెండర్ విడుదల చేయలేదు. ఇది అధికారులపై ఒత్తిడి పెంచడమే కాకుండా, కాంట్రాక్టర్లకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.
కలెక్టర్ల సాక్షిగా భరోసా: జిల్లా యంత్రాంగం సమక్షంలో ఈ తేదీలు ప్రకటించడం వల్ల, కేవలం నిధులు మాత్రమే కాదు… పనుల వేగంపై నిరంతర నిఘా ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ క్యాలెండర్: జలధారల లక్ష్యాలు
ప్రతి ఎకరాకు నీరు అందించే లక్ష్యంతో రూపొందించిన పూర్తి జాబితా ఇక్కడ ఉంది:
2026 — లక్ష్యాలు
కాటన్ బ్యారేజ్ గేట్లు: జూన్ 2026
పోలవరం ఎడమ ప్రధాన కాలువ: జూలై 2026
వెలిగొండ ఫేజ్-1: ఆగస్టు 2026
నేరడి బ్యారేజ్ (ఫౌండేషన్): నవంబర్ 2026
మహేంద్రతనయ: డిసెంబర్ 2026
తారకరామ తీర్థ సాగరం: డిసెంబర్ 2026
కుప్పం బ్రాంచ్ కెనాల్: డిసెంబర్ 2026
2027 — లక్ష్యాలు
వంశధార ఫేజ్-2 (స్టేజ్-2): మార్చి 2027
వంశధార – నాగావళి లింక్: ఏప్రిల్ 2027
తోటపల్లి బ్యారేజ్ పనులు: మే 2027
నాగావళి-చంపావతి అనుసంధానం: జూన్ 2027
పోలవరం ప్రాజెక్ట్ (మెయిన్ డ్యామ్): జూన్ 2027
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (ఫేజ్-1): జూన్ 2027
బుడమేరు వరద నివారణ పనులు: జూన్ 2027
చింతలపూడి ఎత్తిపోతల పథకం: జూన్ 2027
వెలిగొండ ఫేజ్-2: జూన్ 2027
హంద్రీ-నీవా ఫేజ్-2: జూలై 2027
పులిచింతల ప్రాజెక్ట్ (మిగిలిన పనులు): ఆగస్టు 2027
గాలేరు-నగరి సుజల స్రవంతి (ఫేజ్-1): సెప్టెంబర్ 2027
సోమశిల – స్వర్ణముఖి లింక్: అక్టోబర్ 2027
సోమశిల హైలెవల్ కెనాల్: నవంబర్ 2027
గాలేరు-నగరి సుజల స్రవంతి (ఫేజ్-2): డిసెంబర్ 2027
2028 — లక్ష్యాలు
వేదవతి ఎత్తిపోతల పథకం: జూన్ 2028
భైరవాని తిప్ప: జూన్ 2028
అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్: జూన్ 2028
ఇది సంకల్పానికి పరీక్ష!
సాధారణంగా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో దేవుడికే ఎరుక అనే మాట వింటూ ఉంటాం. కానీ ఏపీలో ఇకపై అన్నీ పారదర్శకం. “అన్నీ చేస్తాం” అనే పాత మాటల కంటే, “ఈ తేదీకల్లా పూర్తి చేస్తాం” అనే కొత్త భరోసా రైతులో కొండంత ధైర్యాన్ని నింపుతోంది.
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న ఈ నిర్ణయం, రాష్ట్ర సాగునీటి రంగంలో ఒక సరికొత్త స్వర్ణయుగానికి నాంది పలకబోతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది… ఈ జల సంకల్పం విజయవంతమైతే, ప్రాజెక్టుల నిర్వహణలో ఏపీ దేశానికే ఒక ‘రోల్ మోడల్’గా నిలుస్తుంది!