హైదరాబాద్: బీఆర్ఎస్ మలేషియా – మైటా ఆధ్వర్యంలో జూన్ 6, 2026న కౌలాలంపూర్లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మహిళ అధ్యక్షురాలు కిరణ్మయి, మైటా సభ్యులు సుప్రియ, అశ్విత, శివ లతో సమావేశం నిర్వహించి జూన్ 6న మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ వున్నారు.