Suryaa.co.in

Andhra Pradesh

ఈ నెల 19న నామినేషన్ వేయనున్న బాలకృష్ణ

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు.

ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ”స్వర్ణాంధ్ర సాకార యాత్ర” పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.. రేపు ఉదయం 9 గంటలకు కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న బాలయ్య.. ఆ తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో బాలయ్య పర్యటించేలా షెడ్యూల్‌ రూపొందించారు.

LEAVE A RESPONSE