-మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందీ ఈ 58 నెలల్లోనే
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో– 2024 ను క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్.జగన్
మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్ గా…. ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలల అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
మొట్టమొదటి సంవత్సరంలో ఏ 85 శాతమో 86 శాతమో లేక 88శాతమో టిక్ చేస్తే, చివరి ఏడాదికి వచ్చేసరికి 99శాతం పైచిలుకు మేనిఫెస్టోను అమలు చేసి మనం ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి.
నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలోనే, రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు, డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. అవి నేరుగా వారి చేతికే అందడం. ఇదొక హిస్టరీ. రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాకు చెల్లెమ్మలకు దేవుడి దయతో, మంచి చేయగలిగాము.
.నాకు 2014లో అధికారం రాలేకపోయినప్పటికీ చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మధ్య తేడా గమనించండి.
టీడీపీ 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ముఖ్యమైన అంశాల్లో.. రైతుల రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తాను అన్నారు. రూ. 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనే ఈ ప్రశ్నను నేను అడుగుతున్నాను.
. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెబుతున్నాను. చేయలేకపోతే చేయలేను అని చెబుతాడు తప్ప జగన్ ఎప్పుడూ అబద్ధాలు ఆడడు. జగన్ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనవి కూడా చాలా చేశాం. చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో.
ఇప్పుడు కాపు నేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి. మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది. మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంచడం, పిల్లలకు విద్యా కానుక, గోరుముద్ద మేనిఫెస్టోలో లేవు. ఇటువంటివి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. ప్రతి ఒక్కరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఒక్కటే.
ఈరోజు ఉన్న పరిస్థితుల దష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో, ఆ మేరకు నేను చెప్పగలుగుతా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదల్చుకోలేదు. ఎందుకంటే అది అబద్ధాలు అని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగినవి మాత్రమే జగన్ చెబుతాడు. అవకాశం, వెసులుబాటు ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్లీ మళ్లీ చెబుతున్నాను.