Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలుగు రాష్ట్రాల్లో ఎండ ఇక ప్రచండ‘మే’

– తీవ్ర వడగాల్పులు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. సూర్యోదయం నుంచే వేసవి తీవ్రత కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఈ వారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేయనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున సాయంత్రం వరకు బయటకు వెళ్ళకుండా ఇళ్ళ వద్దనే ఉండాలని సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE