బిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా
బిఆర్ఎస్ పార్టీకి వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయునున్నట్లు పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో వేములపల్లి జెడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్య, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇరుగుదిండ్ల పద్మ గోవిందు, మాజీ సర్పంచులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, అంకెపాక రాజు, పిఏసిఎస్ డైరెక్టర్లు గొట్టే సైదులు, బంటు నాగమ్మ సైదులు, కోడిరెక్క శంభులింగం, చింతకాయల వీరేందర్, నిడుకొండ రామచంద్ర(చందు), వంగూరి వెంకటయ్య, ఇరుగుదిండ్ల రాజు తదితరులు ఉన్నారు.