Suryaa.co.in

Telangana

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాల్సిందే

-బాండ్‌ పేపర్‌ రాసిచ్చి రైతులను మోసగిస్తారా?
-లేకుంటే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తాం
-తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
-జగిత్యాల పర్యటనలో మాజీ మంత్రి హరీష్‌రావు

జగిత్యాల జిల్లా కొడిమియల్‌ మండల్‌ పూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం సందర్శిం చారు కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నామని, ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండని సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమేనని గోడు చెప్పుకున్నారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడు తూ అన్ని రకాల వడ్లకు 500 బోనస్‌ ఇవ్వాల్సిందేనని, లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని తెలిపారు.

బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చి మోసం చేస్తారా
ఇక్కడే రమేష్‌, లక్ష్మారెడ్డి అనే రైతులు ఉన్నారు. నెల క్రితం ధాన్యం తెచ్చారు. రాత్రి వర్షంతో సంచులు తడిచిపోయాయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తింది. ధాన్యం కొనుగోలు చేయక తీవ్ర నష్టం జరిగింది. చాలామంది రైతులు దాదాపు 100, 200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క బాండ్‌ పేపర్‌ మీద వడ్లకు 500 బోనస్‌ ఇస్తామని రాసిచ్చి నేడు సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కు తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడితే రెండు లక్షల 97 వేల ఎకరాల్లో జగిత్యాల జిల్లాలో యాసంగిలో వారి పంట పండితే ఇందులో 2,80,000 ఎకరాల్లో దొడ్డు వడ్లు ఉంటే, 10 వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలు వేశారన్నారు.

రైతులను అవమానించేందుకేనా గెలిపించింది
లక్ష్మారెడ్డి అనే రైతు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి అన్ని రకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలని కొంతమంది మొరుగుతున్నారని అంటున్నారని, ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను కుక్కలు అంటున్నారా అని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు. రైతులను అవమానించేందుకేనా మిమ్మల్ని గెలిపించిందని ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు మేల్కొని హైదరాబాద్‌లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన మొలకెత్తిన వడ్లను కొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE