-జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
-మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, నరసరావుపేట ఘటనలే ఉదాహరణ
-పిన్నెల్లిని కావాలనే తప్పించారు.. నామమాత్రపు కేసులు పెట్టారు
-ఆయనపై 307 సెక్షన్ పెట్టి ఉంటే బెయిలు వచ్చేది కాదు
-డీఎస్పీ చైతన్య వంటి వారి అండతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు
-జూన్ 4న టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం
-వైసీపీ నేతలు రాష్ట్రం విడిచి పారిపోవడం తథ్యం
-ఇకనైనా అధికారులు భయం నుంచి బయటకు రావాలి
-కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు సహకరించాలి
-శాసనమండలి సభ్యులు మహ్మద్ ఇక్బాల్
జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే రాష్ట్రంలో డబ్బుల పందేరంతో పాటు అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా గులకరాళ్ల దాడి జరగలేదు. కోడి కత్తిపోట్లు లేవు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాదయాత్ర నిర్వహించినా ఎక్కడికి వెళ్లినా ఎక్కువ భద్రతను అప్పటి ప్రభుత్వం కల్పించింది. నేడు జగన్‌రెడ్డి, ఆయన తొత్తులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలపై దాడులు, హింసకు తెగబడ్డారు. పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటలతో పాటు చాలా చోట్ల విధ్వంసం, రక్తపాతం సృష్టించారు. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసినా గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణం. వెంటనే 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదు. వైసీపీ గుండాల అరాచకంతో శేషగిరిరావు ఊరివిడిచి పొలాల్లో ఉంటున్న పరిస్థితి వచ్చింది. శేషగిరిరావును హత్య చేయాలని చూసినా కేసు పెట్టలేదు. మాచర్లలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
పిన్నెల్లి దౌర్జన్యంగా 74 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులుకు తెగబడ్డారు. వైసీపీ దాడులతో 100 ముస్లిం కుటుంబా లు సొంత ఊరు విడిచిపోయారు. బీసీ వ్యక్తి చంద్రయ్యను సినిమా తరహాలో దారుణంగా గొంతుకోసి చంపారు. పిన్నెల్లి రామకృష్ణ మంత్రి పదవి ఆశించి రాకపోవడంతో జగన్ రెడ్డి పిన్నెల్లికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో పిన్నెల్లి ఇష్టా నుసారంగా దోచుకున్నాడు. దాదాపు రూ.2000 కోట్లు కొల్లగొట్టాడు. నియోజక వర్గంలో రెచ్చిపోయాడు. అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తించాడు. తెలంగాణ బార్డర్‌లో చెక్‌పోస్టులు పెట్టి కమీషన్లు దండుకున్నాడు.
జగన్‌రెడ్డి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్లలో తాబేదారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ప్రజాస్వామ్యంగా గెలవలేమని భావించి దండుకున్న డబ్బులను పంచి గెలవాలని కుట్ర చేశాడు. ఎర్రగొండపాలెం, పుంగనూరులో చంద్రబాబుపై దాడులు చేయించి మళ్లీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో తాము మాత్రమే ఉండాలని ఎన్నికలు జరగనివ్వకూడదని వైసీపీ నేతలు యత్నించారు. లేని కారుచిచ్చు రగిల్చి రక్తపాతాన్ని సృష్టించారు. డీఎస్పీ చైతన్య లాంటి అధికారులు వంత పాడటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ సానుకూల పరులు సొంత ఊరు విడిచిపోయిన పరిస్థితికి తెచ్చారు.
రక్తపాతం సృష్టించిన పిన్నెల్లి లాంటి నేతలను సౌమ్యశీలులు అంటున్న జగన్ రెడ్డి విజ్ఞత ఏమనాలో అర్థం కావడంలేదు. 2019 నుంచి 2024 వరకు ఇసుక, మద్యంలో దోపిడీలపై రికార్డులను దగ్ధం చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవా లి. కిందిస్థాయి పోలీసులు భయపడకుండా ఎన్నికల కమిషన్ మనో ధైర్యం కల్పించాలి. వారు డ్యూటీలకు వెళితే తిండిలేని పరిస్థితి ఉంది. శాంతిభద్రతలను కలెక్టర్లు, తహసీల్దార్లు కూడా కాపాడాలి. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందిం చి 307 సెక్షన్‌లను పెట్టించాలి.
అధికారులను మార్చారంటూ వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 2019లో కూడా అధికారులను మార్చారు. అప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ, నేడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ పంపిన జాబితాలో నియమించిన అధికారులే విధుల్లో ఉన్నారు. అయినా టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లను కూడా అడ్డుపెట్టుకుని గెలవాలనుకు న్నా రు. దౌర్జన్యాలు, అధికారుల సహకారంతో గెలవాలనుకున్న వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టడంతో హింసకు తెరలేపారు.
పిన్నెల్లి, పెద్దారెడ్డి లాంటి వేటగాళ్లకు మద్దతు తెలుపుతున్న జగన్ రెడ్డి పాలన వద్దని.. ప్రజలకు మేలు చేసే నాయకులు కావాలని జనం చంద్రబాబును గెలపించాలని డిసైడ్ అయ్యారు. జగన్ రెడ్డి అన్ని వ్వవస్థలను సర్వనాశనం చేశాడు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించి బైజూస్‌కు వేల కోట్లు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. 2019లో చంద్రబాబు ప్రజల తీర్పును ఆమోదించారు. నేడు వైసీపీ నేతలు ఓటమి భయంలో హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతోంది. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్‌లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులను బెదిరిస్తున్న నాయకు లు నాలుగవ తేదీ తరువాత కనిపించరు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి.
వైసీపీ నేతల ముసలి కన్నీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. టీడీపీ కూటమి 140 నుంచి 150 సీట్లతో అధికారంలోకి రాబో తుంది. అధికారులు తప్పులు చేయకుండా ఎన్నికల కౌంటింగ్ దగ్గర నిర్భయం గా పనిచేయాలి. దాడులు చేసే వారిని ముందే పసిగట్టి శిక్షించాలి. ఒత్తిడిలో ఉన్న అధికారులు బయటకురావాలి. జూన్ 4 తర్వాత మంచిరోజులు వస్తాయి.