Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి అమ్ముడుబోయిన కాపలా కుక్కలు

-వెధవల్లారా…ఖాకీ డ్రస్‌ వేసుకోవడానికి సిగ్గు లేదా?
-పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు

పోలీసులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారని, ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. బదిలీ, సస్పెన్షన్‌ అయిన వెధవ లు ఖాకీ డ్రస్‌ వేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు అమ్ముడుపోయిన కుక్కలు అంటూ మండిపడ్డారు. ఈవీఎంలను పగులగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులని, పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించిన అపఖ్యాతి జగన్‌కే దక్కుతుందని విమర్శించారు.

ఏపీ హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. రూ.10 వేల కోట్లు ప్రధా న పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాయని, ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందన్నారు. ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలంటూ ధర్నాలు చేయడం హాస్యాస్పదమని, 2029 ఎన్నికలకు ఓటు వేయాలంటే అభ్యర్థి ఇంటికి వెళ్లి కొట్టే పరిస్థితికి రాబోతుందన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, ఓట్ల కోసం మోదీ మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. 200 లక్షల కోట్ల అప్పుల్లోకి దేశం వెళ్లిపోయిందని, 42 శాతం పట్టభద్రులు దేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని, 2047 వరకు మోదీ ప్రధానిగా ఉంటే దేశం సర్వనాశనమవ్వక తప్పదన్నారు. లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

LEAVE A RESPONSE