– రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు
గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ గిరిజనులకు అత్యంత చేరువగా సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు సూచించారు. బుధవారం విశాఖ పట్నం రుషికొండలోని కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రుడు గిరిజన భాషలు, గిరిజన నృత్యాలు, కళలు, పరిశోధన శిక్షణలు తదితర అంశాలపై సమీక్షించారు. గిరిజన ప్రజా ప్రతినిధులకు, గిరిజన ప్రాంతములో పనిచేసే ఉద్యోగులకు, గిరిజన యువతి యువకులకు గిరిజన చట్టాలు, హక్కులు, ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు అందిస్తున్న పథకాలు పైన అవగహన తగతులు నిర్వహించాలని తద్వారా వారిని చైత్యనవంతులను చేయాలని ఈ సందర్భంగా గంధం అన్నారు. క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంత అభివృధికి దోహదపడే విదంగా అవగహన తరగతులు ఉండాలని సూచించారు.
విద్యా శాఖ వారితో సమన్వయంతో గిరిజన ప్రాంతాలలోని ఉపాధ్యాయులు బహు బాషా విధానంలో బోధన చేయగలిగే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మెళుకువలపై శిక్షణలు ఇవ్వటం ద్వారా, గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరితగతిన అర్ధమయ్యే విధముగా కార్యాచరణ రుపాదించాలని సూచించారు.
మరోవైపు అక్కడి కార్యాలయ నిర్మాణం రెండో దశ పనులకు సంబందించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రములో గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సిమ్మన్న. గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ నుండి ప్రొఫెసర్ డా. ఎన్. శ్రీనివాస్, సునీల్, సీతారామయ్య, వెంకటేశ్వర రావు, జైరాం తదితరులు పాల్గొన్నారు.