సీఎం….దిగి రా ..సీబీఐ విచారణ జరిపించి తప్పు సరిదిద్దుకో

-టీఆర్ఎస్ దాష్టీకాలు ఇంకెన్నాళ్లు?
-నిజాంను మించిన అరాచక పాలన కొనసాగుతోంది
-తప్పు చేస్తున్న టీఆర్ఎస్ లుచ్చా నా కొడుకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-కాషాయపు ముద్దు బిడ్డ సాయి గణేష్ మరణానికి కారకులపై శిక్ష పడేదాకా పోరాడతాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘ఒకప్పుడు సినిమాలో విలన్ వస్తే ఇంట్లకు పోయి బిక్కుబిక్కుమని బతికేటోళ్లు… నిజాం పాలనలో రజాకార్లు వస్తే మాన ప్రాణాలు పోతాయని బిక్కుబిక్కుమని బతికేటోళ్లు. మనం నిజాం పాలనను చూడలేదు…. కేసీఆర్ పాలనలో నిజాం కాలం నాటి పరిస్థితులెట్లున్నయో కళ్లారా చూపిస్తున్నరు. నిజాంను మించిన అరాచక పాలనను కొనసాగిస్తున్నరు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నయ్. యాడ హత్య జరిగినా.. అత్యాచారాలు జరిగినా కారకులు టీఆర్ఎసోళ్లే అవుతున్నరు. సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బాధ్యులైన ఒక్క టీఆర్ఎస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటు. దుర్మార్గపు, అరాచక పాలనకు నిదర్శనం’’అంటూ ధ్వజమెత్తారు.

‘సీఎం కేసీఆర్… ఇప్పటికైనా దిగి రా… ఈ దారుణాలపై సీబీఐ విచారణ జరిపించు. తప్పు చేసిన టీఆర్ఎస్ నాయకులను శిక్షించు’’ అని డిమాండ్ చేశారు. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు చేస్తూ ప్రజలను అరిగోస పెడుతున్న టీఆర్ఎస్ లుచ్చా నా కొడుకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం కాషాయపు ముద్దు బిడ్డ సాయి గణేష్ మరణానికి కారకులైన స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు కఠిన శిక్ష పడేదాకా ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయ పరంగా పోరాతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు సహా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ గద్వాల్ జిల్లా మల్దకలోని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శిబిరం వద్ద బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తదితరులు హాజరై జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. అనంతరం ముఖానికి ‘నల్ల మాస్క్’ ధరించి టీఆర్ఎస్ దాష్టీకాలకు నిరసిస్తూ దీక్ష చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

ఒకప్పుడు సినిమాలో విలన్ వస్తే ఇంట్లకు పోయి బిక్కుబిక్కుమని బతికేటోళ్లు… నిజాం పాలనలో కూడా గిట్లనే ఉండేటోళ్లు. రజాకార్లు వస్తే మాన ప్రాణాలు పోతాయని బిక్కుబిక్కుమని బతికేటోళ్లు. మనం నిజాం పాలనను చూడలేదు…. కాబట్టి కేసీఆర్ పాలనలో నిజాం కాలం నాటి పరిస్థితులను కళ్లారా చూపిస్తున్నరు.

ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నయ్. ఎక్కడ హత్య జరిగినా.. అత్యాచారాలు జరిగినా కారకులు టీఆర్ఎసోళ్లే అవుతున్నరు.మంథనిలో లాయర్ వామన్ రావు హత్యకు టీఆర్ఎసోళ్లే కారణం… ఖమ్మంలో టీఆర్ఎస్ అరాచాలకు చట్టానికి లోబడి యుద్దం చేస్తూ కాషాయపు జెండాను రెపరెపలాడిస్తున్న కాషాయపు ముద్దు బిడ్డ సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారు.

సాయి గణేష్ ఈ రోజు పెళ్లి చేసుకోవాల్సిన సమయం. సాయి బతికుంటే… పెళ్లి చేసుకునేటోడు. యాత్రకు వచ్చేటోడు. పోలీసులు వేధించి సూసైడ్ చేసుకునేలా చేశారు.ఎవరైనా సరే… మరణ వాంగ్మూలం ఇస్తే దాని ఆధారంగా కేసు నమోదు చేస్తారు. సాయి గణేష్ నా చావుకు టీఆర్ఎసోళ్లు, పోలీసులే కారణమని మరణ వాంగ్మూలమిచ్చి చనిపోతే… పోలీసులు కనీసం కేసు నమోదు చేయలేదు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. స్థానిక మంత్రి అరాచకాలకు వ్యతిరేకంగా సాయి గణేష్ ఆశయాలను ముందుకు తీసుకెళతామని ఎంతోమంది యువకులు బీజేపీ చేస్తున్న ఉద్యమాల్లో స్వచ్చందంగా పాల్గొంటున్నరు.

వైశ్యులు ఎప్పుడూ గొడవల్లోకి పోరు. వ్యాపారం చేసుకుని నిజాయితీగా బతికేటోళ్లు. ఎవరికైనా ఆపదొస్తే సాయం చేసేటోళ్లు… వాళ్ళు ఈ మధ్యనే రాజకీయాల్లోకి వస్తుంటే టీఆర్ఎసోళ్లు సహించలేకపోతున్నరు. రామాయంపేటలో ఇట్లనే చిన్న వ్యాపారం చేసుకుంటున్న గంగం సంతోష్ ను అధికార పార్టీ మున్సిపల్ ఛైర్మన్ సహా టీఆర్ఎస్ నేతలు వేధించారు. సూసైడ్ కు కారణమయ్యారు.

కోదాడలో కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తండ్రి లేని 20 ఏళ్ల పేదింటి యువతిపై టీఆర్ఎస్ లుచ్చా నాకొడుకులు బలవంతంగా గుంజుకుపోయి మత్తు మందు ఇచ్చి రెండు రోజులు దారుణంగా ఆఘయిత్యం చేశారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా కనికరం లేకుండా వేధించిన కసాయి నా కొడుకులు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే… ‘‘నేను టీఆర్ఎసోడిని నన్నేమీ చేయలేరు. నోరు మూసుకుని పోండి. లేకుంటే చంపేస్తా’’నని బరితెగించి మాట్లాడిండంటే తెలంగాణలో ఏ పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవాలి.జనగాంలో, వరంగల్ లో, హైదరాబాద్ లోనూ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాపానికి కేసులు పెట్టి వేధించిండ్రు.

సీఎం కేసీఆర్… దిగిరా… ఈ అరాచకాలపై సీబీఐ విచారణ జరిపించి చేసిన తప్పును సరిదిద్దుకో. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు బీజేపీ పోరాటం ఆగదు. తక్షణమే సీబీఐ విచారణ జరిపి దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.సాయి గణేష్ ఘటనను బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజా క్షేత్రంలో పోరాడతాం. బాధ్యులైన మంత్రి, టీఆర్ఎస్ నేతలకు శిక్ష విధించే వరకు న్యాయ పరంగా పోరాడతాం.

అంతకు ముందు డీకే అరుణ మాట్లాడుతూ….
టీఆర్ఎస్ అరాచక పాలనలో వ్యాపారస్తులు, ప్రజలు బతకలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించిన పాపానికి బీజేపీ కార్యకర్తలపై, యువకులపై పోలీసుల సాక్షిగా వేధిస్తున్నరు.వాళ్ల ఉసురు పోసుకుంటున్నరు. ఆ దేవుడు టీఆర్ఎస్ నాయకులను క్షమించరు.తెలంగాణ లో పోలీసుల రాజ్యం నడుస్తోంది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. టీఆర్ఎస్ దాష్టీకాలకు నిరసనగా… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నం.

Leave a Reply