ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల హక్కుల పరిరక్షణ రాష్ట్ర సమ్మేళనం

-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల హక్కుల పరిరక్షణ రాష్ట్ర సమ్మేళనం
– హాజరైన అఖిలభారత ఎస్సీ, ఎస్టీ సమన్వయకర్త కొప్పుల రాజు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్

విజయవాడ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల హక్కుల పరిరక్షణ కోసం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల హక్కుల పరిరక్షణ రాష్ట్ర స్థాయి సమ్మేళనం ప్రారంభమైంది.

ఈ సమావేశానికి అఖిలభారత ఎస్సీ, ఎస్టీ సమన్వయకర్త కొప్పుల రాజు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్ హాజరయ్యారు. ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, సిరివేళ్ళ ప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక
apcc1 అధ్యక్షులు డాక్టర్ తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీ, మైనారిటీ సెల్ చైర్మన్ దాదా గాంధీ, కిసాన్ సెల్ ఛైర్మన్ జెట్టి గురునాథ్ రావు, AIUWC రాష్ట్ర చైర్మన్ ఎన్. వి.శ్రీనివాస్, ఏపీఆరోలు హసీనా సయ్యద్, స్పెన్సర్ లాల్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్), పరస రాజీవ్ రతన్, అడ్మిన్ ఇంచార్జి రవికాంత్ నూతలపాటి, జిల్లా, నగర అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్సులు, అధికార ప్రతినిధులు, సెల్స్ రాష్ట్ర చైర్మన్ లు మరియు 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ పార్టీలను పొలిమేరల నుంచి తరిమికొట్టాలి
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి
ప్రజలకు శని గ్రహం లా దాపురించిన ఈ ప్రాంతీయ పార్టీ లను ఆంధ్ర ప్రదేశ్ పొలిమేరల నుంచి తరిమికొట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. విభజన చట్టంలో రావాల్సిన రో.5 లక్షల కోట్ల విలువ చేసే ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సాయం, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే, తెచ్చే శక్తి ఈ పార్టీ లకు లేదని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ని, ముగ్గురూ మోడీ చేతిలో కీలు బొమ్మలు గా మారారని ధ్వజమెత్తారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, 2024లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు.