Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ప్రభుత్వంలో ఆన్ లైన్ సైబర్ అవినీతి

దేవాదాయ శాఖ కమిషనర్ గొల్లపూడి కార్యాలయంలోనే సాఫ్ట్ వేర్ హ్యాకింగ్ జరిగింది, ముఖ్య ఫైల్స్ మాయం అయ్యాయి. కొన్ని ఫైల్స్ ట్యాంపరింగ్ జరిగాయి. దేవాదాయ శాఖ నిర్వహించే వేలం ఆక్షన్లకు సంబంధించిన లక్షల్లో డబ్బులు గోల్ మాల్ జరిగింది. ఈ దోపిడిలో ప్రధాన అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం. అత్యంత ప్రఖ్యాతిగాంచిన దేవాదాయ శాఖలోని తమ సొంత కమిషనర్ కార్యాలయంలోనే సైబర్ క్రైమ్ ద్వారా ఇంత పెద్ద అవినీతి జరిగితే పట్టించుకోని దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణ కూడా ఎందుకు జరపడంలేదు .

ఈ ఆన్ లైన్ సైబర్ అవినీతి నేరం అంశంపై జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించి తక్షణమే విచారణ చేపట్టాలి. న్యాయమూర్తులు, జర్నలిస్టులతో ఒక విచారణ కమిటీ వేయాలి. ఈ కమిటీ ద్వారా అవినీతి చేసి దేవుడి సొమ్మును నొక్కేసిన దేవాదాయ శాఖ లోని తిమింగళాలను, అసలు దోషులను వెంటనే శిక్షించాలి… దేవుడు సొమ్మును దేవుడికి చెందేలా తక్షణమే జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ నిద్రవీడి జరిగిన సైబర్ అవినీతి పై పారదర్శకంగా విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని లేనిపక్షంలో భక్తులుగా తాము హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటాలకు సిద్ధం అవుతామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక.

LEAVE A RESPONSE