– సీఎంగా హాజరు నుంచి మినహాయింపు
– జగన్ ఈసారి కోర్టుకు హాజరుకాక తప్పదు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మాజీ ముఖ్యమంత్రిగా మారిన వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఇక సినిమా కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ అక్రమాస్తుల కేసులో, బెయిల్పై బయట ఉన్న జగన్.. సీఎం కావడంతో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో.. ప్రతి శుక్రవారం హైదరాబాద్కు వస్తే ట్రాఫిక్ సమస్యలతోపాటు, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని వాదించారు. దానికితోడు ఆర్ధికభారం కూడా అవుతుందని విన్నవించారు. దానితో కోర్టు ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం జగన్కు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడాయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అంతా ఖాళీగానే ఉంటారు. కాబట్టి ఇకపై ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థితి. అంటే మిగిలిన వారిలా జగన్మోహన్రెడ్డి కూడా, సహ నిందితుల మాదిరిగానే జడ్జి ఎదుట చేతులుకట్టుకుని దణ్ణం పెట్టి నిలబడాల్సిందే.