Suryaa.co.in

Political News

దటీజ్..బాబు!

ఇవాళ దేశ రాజధానిలో అద్భుత దృశ్యాలు. ప్రతి తెలుగువాడూ అబ్బురపడే సంఘటనలు ఆవిష్కృతమయ్యాయి. దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే నాయుడి నోటి నుండి వెలువడిన ఒకే ఒక్క మాటపై నిలదొక్కుకొంది. నేను ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నాను అనంగానే. ఎవరన్నా ఊహించారా.. అని ఒక నాలుగు దశాబ్దాలుగా నాయుడిని గమనించేవారిని అడిగితే నవ్వుతారు, అడిగిన వారి అమాయకత్వంను చూసి.

ఒక పదేళ్లుగా మన వేంకటేశ్వరస్వామి ప్రతిమలను ఢిల్లీకి తీసుకువెళ్లి, ఇచ్చి, నమస్కరించేవాళ్లను చూసి మన ఆత్మగౌరవం ఇదా అని ప్రశ్నించే వారికి దిమ్మతిరిగేలా.. భాజాపా అధ్యక్షుడు & దాని నంబర్ 2 నాయకుడు అమిత్ షా గారి వద్ద పుష్ప గుచ్ఛం అందుకునే గౌరవం నాయుడు పొందిన అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది.

జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులు అంతా పోటీపడుతూ సెల్ఫీ దిగారు నాయుడితో. క్రేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటే నవ్వుతారు బిల్ గేట్స్ ని పాత స్నేహితుడిలెక్కన గేట్స్ అని ముద్దుగా పిలిచే ది గ్రేట్ చంద్రబాబు నాయుడి గురించి తెలిసినవారు.

ఢిల్లీ ఎయిర్పోర్టులో నాయుడు కనిపిస్తే వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి మన ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పర సహకారం కోరుతూ అర్థించాను అని, ఆ అపూర్వ ఘటనను తన ట్విట్టర్ వేదిక ద్వారా తమిళనాడు సీఎం స్టాలిన్ పోస్టు కూడా పెట్టారు.

ది గ్రేట్ లెజెండ్ నాయుడి గురించి రజినీకాంత్ ఒక మాట అన్నాడు. గుర్తుందా. ఆయన తెలుగురాష్ట్రాలు మాత్రమే గౌరవించే వ్యక్తి కాదు, దేశం కోరుకునే శక్తి, ప్రపంచం మెచ్చే నాయకుడు అని.

రేయ్ గల్లీ దరిద్రులారా.. బెయిల్ మీద ఉన్న ఒక 420 కేడీ జగన్, నిష్ఠ దరిద్రులతో తిట్టించి, అరెస్ట్ చేసినా.. ప్రపంచంలో ఏ తెలుగువాడూ.. దేశంలో చదువుకున్న ఎవడూ.. ప్రపంచ నాయకులు ఎవరూ ఆయన తప్పుచేశాడు అని నమ్మకుండా.. ఆయన క్షేమం కోసం సంఘీభావం ఎందుకు వ్యక్తం చేశారో అప్పుడే తెలులుకోవాల్సింది.

చాలా ఆలస్యంగా తెలుసుకొన్నారు. ఆయనను ఏ తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేశారో ఆ సిఐడి అధికారులు అమెరికా పారిపోవడానికి అనుమతులు అడిగి, ఆ విషయం తెలిసి, మీడియాలో వచ్చేసరికి ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేమని సెలవు రద్దు చేసుకొంటున్నారు. ఆ ఆఫీసు నుండి పూచిక పుల్ల పోకూడదు అని అనేసరికి, గజగజ వణికిపోతోన్నారు.

నిప్పులాంటి చంద్రబాబును ముట్టుకొన్న ప్రతిఒక్కడూ.. ఎందుకు పెట్టుకొన్నామా అని భయపడిపోతున్నారు.

ఆయన ఏమి కోరినా కాదనే ఈ సమయంలో.. దేశం కోసం & రాష్ట్రం కోసం ఆయన హుందాగా పదహారు ఎంపీ స్థానాలతో.. ప్రజలను & రాష్ట్రాన్ని గెలిపించేలా ప్రవర్తిస్తున్నారు. 25కు 25 ఇస్తే మెడలు వంచేస్తా అన్న 420 గానీ.. ఆయన స్థానంలో వుండివుంటే ఈ పాటికి తన కేసులు కొట్టేయమని పాదాల దగ్గర పడి తెలుగువాడి గౌరవాన్ని తాకట్టుపెట్టేవాడు.

ఇప్పుడే ఏమయ్యింది.. ఎప్పుడు బెయిలు రద్దు అవుతుందా.. శిక్షపడుతుందా.. లేదా కొత్తకేసులో లోపల వేస్తారా.. దేశం విడిచిపారిపోవాలా అని ఆలోచిస్తూ.. నిద్రలేని కాళరాత్రులు నిన్నటి నుండి మొదలైంది జగనుకు. అదే పెద్ద శిక్ష. చట్టం & న్యాయం ప్రకారం, తాను చేసుకొన్న కర్మ ప్రకారం అనుభవించబోయే క్రిమినల్ జగన్ మాటలను నమ్మి, చులకనగా చూసిన ప్రతి ఒక్కడూ సిగ్గుపడేలా.. వాగిన ప్రతి ఒక్కడూ వణికిపోయేలా నాయుడి టైం నడుస్తోంది.

ప్రతి తెలుగువాడూ ఉప్పొంగిపోతూ.. ఇదిరా మన తెలుగువాడి ఘనత అని గర్వపడే రోజులు వచ్చాయి. బి హేపీ.

– చాకిరేవు

LEAVE A RESPONSE