Home » సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్

సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్

-స్వచ్చందంగా బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు
-రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం
-ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి సర్క్యులేషన్
-ఆ టీవీ చానెళ్ల ఆదాయం ఢమాల్?
(అన్వేష్)

ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా కేబుల్ ఆపరేటర్లు బ్యాన్ చేస్తున్నారు . రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓ లు.. రాష్ట్ర అభివృద్ధి కి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలో అధికారం మారి 48 గంటలు గడుస్తున్నా ఆయా ఛానెల్స్ యజమానుల తీరు మారకపోవడం, అందులో పనిచేసే జర్నలిస్టులు, యాంకర్లు ఇంకా రాష్ట్రం పై విషం చిమ్మడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వ్యతిరేక వార్తల తో రెచ్చిపోవడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వార్తలు వండి వార్చడం వంటి అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్ గా తీసుకున్నారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసారు. ఇప్పుడు కూడా మారకపోతే ఎలా అంటూ స్వచ్ఛందంగా ఆయా ఛానెల్స్ ని బంద్ చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్ లో కూడా ఈ ఛానెల్స్ తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి సర్క్యులేషన్ పడిపోయిన వార్త కూడా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలి అని ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి 12 లక్షల ఫేక్ సర్కులేషన్ ను అధికంగా చూపించారు.

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు మరు క్షణమే సాక్షి కనపడితే కాళ్లు విరగ్గొడతామ్ అని కింది స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఒకే రోజు సాక్షి 12 లక్షల సర్క్యులేషన్ కోల్పోయింది.

పడిపోనున్న ప్రకటన ఆదాయం?
గత ఐదేళ్ల పాటు జగన్‌కు శ్రమదానం చేసిన టీవీ 9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి ప్రసారాలు నిలిపివేయాలన్న కేబుల్ ఆటరేటర్ల నిర్ణయం, వాటి ఆదాయానికి గండికొట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే చానెళ్ల రీచింగ్-రేటింగ్ బట్టే వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. పైగా టీవీ 9, ఎన్టీవీకి డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉండటంతో వాటికి అదనపు ఆదాయం వస్తోంది.
ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు వాటిని బంద్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఇక చానెళ్లు జనంలోకి వెళ్లలేవు. ఫైబర్ గ్రిడ్‌లో కూడా లేకపోవడం వల్ల ఇక ఆ చానెళ్లకు ఆర్ధిక కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు ప్రభుత్వ ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు దాదాపు శూన్యం. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 చానెళ్లకు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించింది. ఫలిత ంగా ఆ చానెళ్లు ఆర్ధికంగా భారీగా నష్టపోయాయి. ఇప్పుడు టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీ ఆర్ధిక పరిస్థితి కూడా అదేవిధంగా ఉండబోతోంది.

ఐదేళ్ల పాటు సాక్షి పత్రిక-చానెళ్లకు ప్రకటనల కోసం సమాచార శాఖ బడ్జెట్‌ను ఊడ్చేసింది. సింహభాగం నిధులు దానికే కట్టబెట్టారు. దాదాపు వందకోట్ల రూపాయలు సాక్షికే ఇచ్చారని టీడీపీ గతంలోనే ఆరోపించింది. అటు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కూడా, సాక్షికి దోచిపెట్డడంతో జగన్ సొంత మీడియా ఆర్ధికంగా బలపడింది.

కాగా.. వీటిలో టీవీ9, ఎన్టీవీకి చెందిన యాజమాన్య ప్రతినిధులు.. ‘కమ్మకుల కార్డు’తో టీడీపీ ప్రభుత్వానికి చేరువయ్యే ప్రణాళికకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేను కులం కార్డు అడ్డుపెట్టుకుని.. కొద్దికాలం క్రితం భోజనానికి ఆహ్వానించిన ఓ టీవీ చానెల్ యజమాని.. ఇకపై తాను న్యూట్రల్‌గా ఉంటానని, ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పాలని కోరినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.

అదేవిధంగా బాబుకు సమీపంలో ఉండే వారిని సైతం, ఈ టీవీ సంస్ధలు మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కులం కార్డు ద్వారా టీడీపీ సర్కారుకు దగ్గర కావాలన్నదే ఈ చానెళ్ల లక్ష్యమని తెలుస్తోంది. అటు బీజేపీలోని తమ ‘కుల’వేల్పుల ద్వారా కూడా, పైరవీలకు తెరలేపినట్లు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Leave a Reply