Suryaa.co.in

Political News

కడప మహానాడు.. జన సునామీ.. సీమ మర్యాద!

(భూమా బాబు)

చల్లని కడప గడ్డ… చరిత్రకు సాక్షిగా నిలిచింది! విజయవాడలో ఉరుములు, మెరుపులు వర్షమై కురిస్తే, కడపలో మాత్రం జన సునామీ ఉవ్వెత్తున ఎగిసిపడింది!

ఆ పసుపు మయం… అది కేవలం రంగు కాదు, కడప మహానాడు ప్రాంగణంలో లక్షలాది గుండెల స్పందన! రాష్ట్రం నలుమూలల నుంచీ… ద్విచక్ర వాహనాలపై, కాలినడకన, ఆశల పతాకాల్ని మోసుకొచ్చారు కార్యకర్తలు, ప్రజలు. కడప రహదారులు వాహనాలతో కిటకిటలాడితే, మట్టి రోడ్ల వెంటా జనం పరుగులు తీశారు!

ప్రాంగణంలో మూడు లక్షల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు… కేవలం కడుపు నింపడానికే కాదు, వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. దారిపొడవునా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో నాయకులు తీర్చింది దాహార్తిని కాదు, ప్రజల ఆశలను! జిల్లా పేరులో దేవుని నామం మళ్లీ చేరడంతోనేమో, ప్రకృతి కూడా సహకరించింది, వాతావరణం చల్లగా మారింది.

వేదికపై వాడి వేడి వాగ్బాణాలు… సభాప్రాంగణం చప్పట్లతో, ఈలలతో, కేకలతో దద్దరిల్లి మారుమోగిపోతోంది. కడప గడ్డ మీద… ఇది కేవలం రాజకీయ సభ కాదు. ఒక సెంటిమెంట్, ఒక త్యాగం, ఒక పోరాటం! అందుకే, ‘కడప’ అనగానే వారి రక్తంలో రెట్టించిన ఉత్సాహం ఉప్పొంగింది.

జనం… ప్రాంగణం లోపలికి రాలేకపోయినా, వెనక్కి వెళ్ళలేదు. గేట్ల వద్ద నిలబడి, నినాదాలతో తమ మద్దతును చాటుతున్నారు. ఇవన్నీ ముందే ఊహించి, కరోనా పేరు చెప్పి, భారీ వర్షాల పేరు చెప్పి… జగన్ ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినా, ఆయన భయపడ్డట్టే జరిగింది! ఆయన గుండెలు గుబేలు మనేలా… చరిత్రలో ఎప్పుడూ చూడని జన సునామీని ఈ రోజు కడప చూసింది. ఇది ప్రజల విజయం! కడప ఆత్మవిశ్వాసం! తనదైన సీమ మర్యాదలతో.. ఆదరణతో సరికొత్త కడపగా మహానాడుకు వచ్చిన వారి అభిమానాన్ని చూరగొంది.

పార్టీ అధ్యక్షుడిని చూసి, తనకు అవకాశం ఇచ్చారని భావోద్వేగానికి గురైన కడప పార్టీ అధ్యక్షుడు రెడ్డేప్ప గారి శ్రీనివాసరెడ్డి.

LEAVE A RESPONSE