ప్రభుత్వ లాంఛనాలతో మీడియా దిగ్గజం రామోజీ రావు అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.