ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తర్వాత గుంటూరుకు వచ్చి, తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ముందుకు నడవగలిగాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అమ్మను దర్శించుకున్నాను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని పెమ్మసాని దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు దేవాలయ సత్కారంతో పాటు ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో రామారావు, కృష్ణా జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.