Suryaa.co.in

Andhra Pradesh

అధికారం ఉంటేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా?

• జగన్ రెడ్డి స్పీకర్ కు లెటర్ రాయడం సిగ్గుచేటు
• ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్య
• మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తుందన్న విషయం కూడా జగన్ కు తెలియకపోవడం బాధాకరం
• ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికి భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటు
• ఆరు మంది టీడీపీ శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని మీరన్న మాటలు మరిచిపోయారా ?
ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా?
• ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుండి బయటకు రావాలి
• జగన్ పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ లేడు అందుకే సొంత నియోజకవర్గంలో కూడా జగన్ రెడ్డిపై రాళ్లు విసిరారు
• ఎన్నికల్లో జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు
కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి

మంగళగిరి: జగన్ రెడ్డి జనాలకు ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపాడని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ కు లేఖ రాస్తున్నాడని… అసలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఒకసారి ఎంపీ, ఒకసారి సీఎంగా పనిచేసిన జగన్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ పై కనీస అవగాహన లేదని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి ధ్వజమెత్తారు.

సిగ్గులేకుండా ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఉంటే నే అసెంబ్లీలోకి అడుగుపెడతారా? సీఎం అయితేనే గాని జగన్ రెడ్డి అసెంబ్లీలోకి రారా? అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ సమస్యలపై గళమెత్తకుంటే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏమని సమాధానం చెబుతావ్ జగన్ రెడ్డి ? అని మాధవిరెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

మాధవి రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ కు లేఖ రాయడం చూస్తే ఆయనకు రాజ్యాంగం పై ఎటువంటి అవగాహన లేదని స్పష్టం అవుతోంది. మొత్తం సభ్యుల్లో 10% ప్రతిపక్షానికి ఉండాల్సిన అవసరంలేదని లేఖరాయడమే దీనికి ఉదాహరణ. రూల్ నెంబర్.56 క్లాజ్ నెంబర్ c లో క్లియర్ గా రాశారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని.

ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేకే జగన్ రెడ్డి రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సభ్యులు ఉండాల్సిన అవసరం లేదనడం జగన్ రెడ్డి దిగజారుడు తనంకు నిదర్శనం. జగన్ రెడ్డి ప్రజల కోసం పనిచేయకుండా, అధికారం ఉంటేనే పని చేస్తా ననడం దారుణం.

1994 లో 26 సీట్లు గెలవడంతో జనారన్థన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారంలో ఆయన్ను ఆల్ఫబిటికల్ ఆర్డల్ లోనే పిలిచారు. కానీ నేడు టీడీపీ మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని గౌరవించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ చేత ప్రమాణం చేయించారు. ఆ ఇంగితం కూడా జగన్ రెడ్డి చూపించడంలేదు.

2014 నుండి 19 వరకు పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తగినన్ని సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికోసం భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటు.

స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు. దాచుకోవడం, దోచుకోవడానికి తప్ప ప్రజా సేవకోసం వచ్చిన పార్టీ వైసీపీ కాదని ప్రజలు గమనించారు. లేఖ రాసి సింపతి కొట్టేసి జనాల్లోకి వెళ్లడానికి జగన్ నాటకాలు ఆడుతున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ఏనాడు జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు.

ఆరు మంది శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని పేర్ని నానితో అనిపించిన మాటలు రికార్డులో ఉంది అది మరచిపోయారా? ఆరోజు టీడీపీలోని ఎమ్మెల్యేలను లాక్కుని మా పార్టీకి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన మీరు, ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతూ.. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? నాడు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల సమస్యలపై డాం.

నేడు సాకులతో జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా కుయుక్తులు పన్నడం ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉంటేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా? 11 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పినా మారరా? ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుండి బయటకు వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. జగన్ పాలనలో నష్టపోని వ్యక్తి ఎవరూ లేరు అందుకే జగన్ రెడ్డిపై దాడులు చేస్తున్నారు. అందుకే కట్టుకున్న ప్యాలెస్ లకు కంచె పెట్టుకుంటున్నాడు.

LEAVE A RESPONSE