-
జగన్ రెడ్డి అరాచకం ముందు ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందకు పనికి రాడు
-
అంబేద్కరిజంపై దాడి చేసిన ద్రోహి జగన్ రెడ్డి
-
ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల పేర్లు అంబేద్కర్ కాళ్లకింద ఉండటానికి కూడా దళిత సమాజం ఓప్పుకోవడం లేదు
-
అందుకే ఎవరో జగన్ రెడ్డి పేరును తొలగించారు
-
పేరు తొలగింపుపై జగన్ &కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు
-
చంద్రబాబు, లోకేష్ లపై విష ప్రచారం చిమ్ముతున్నారు
-
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా పేర్ల తొలగింపును నేను ఖడిస్తున్నా
-
కాని ఒక దళిత బిడ్డగా జగన్ రెడ్డి పేరు తొలగింపును మద్దతిస్తున్న
-
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ &కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని.. చంద్రబాబు, లోకేష్ లపై కావాలనే విష ప్రచారం చిమ్ముతున్నారని.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. నాడు వివేకాను చంపి గుండెపోటు అని బ్లూ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు. దాన్ని చంద్రబాబు, టీడీపీలపై రుద్దారు. వివేకా హత్య, కోడి కత్తి నాటకం జగన్ డ్రామాలేనని సీబీఐ, ఎన్ఐలే తేల్చాయి. చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షాన ఉంటానని చెబితే దాన్ని వక్రీకరించి వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మాట్లాడిన దాంట్లో ముందు వెనుక కట్ చేసి దాన్ని దళితులపై తప్పుగా ప్రచారం చేశారు. వైసీపీ నేతలు మనుషులకు పుట్టారా? తప్పులకు పుట్టారా అనిపిస్తొంది. అంబేద్కర్ కంటే జగన్ పేరు కనపడేలా తాటికాయంత పెట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు తీసేసి వైఎస్ఆర్ విదేశీ విద్యాకానుక అని పెట్టుకున్నాడు. దాంతో ఎవరికి కోపం వచ్చిందో జగన్ పేరును తొలగించారు.
అలాంటి పనులు చేయడాన్ని టీడీపీ తరఫున ఖండిస్తున్నాం. వారి మీద పార్టీ చర్యలు తీసుకుంటుంది. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించినా… ఒక దళితుడిగా జగన్ పేరును తొలగించడంపై ఆనందపడ్డా. జగన్ రెడ్డి వ్యభిచారులకు నాయకుడు. దువ్వాడ శ్రీనివాస్ కు నేను గార్ల్ ఫ్రెండ్ అంటూ ఒక మహిళ బయటకు వచ్చింది. ఆమెనే చెప్పింది దువ్వాడ ఆ మహిళ వ్యభిచారం చేస్తున్నట్లు. అంబటేమో ఓ మహిళతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు. గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ మాట్లాడుతూ దొరికాడు. ఇలాంటి వ్యభిచారులందరికి జగన్ రెడ్డి నాయకుడు. వ్యభిచారుల నాయకుడికి అంబేద్కర్ విగ్రహం పెట్టాడానికి అర్హత ఉందా?
డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేసిన అనంత్ బాబుకు, బాబాయిన చంపిన అవినాష్ రెడ్డికి, డాక్టర్ సుధాకర్ ను రోడ్డుమీద ఈడ్చి ఈడ్చి చంపిన పెట్ల గణేష్ లాంటి నాయకులందరికి పెద్ద డాన్ జగన్. గంజాయి డాన్ జక్కంపూడి, డ్రగ్స్ డాన్ ద్వారంపూడి లాంటి వారందరికి జగన్ నాయకుడు. జగన్ కరుడు గట్టిన నేరస్తుడు.. జగన్ రెడ్డి ముందు పాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు.
వివేకానంద రెడ్డి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు, జగన్ రెడ్డి పేరు వేసుకుంటే దానికి సునితారెడ్డి గాని ఒప్పుకుంటే అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు వేసుకోవడానికి ఒప్పుకుంటాం. వివేకానందరెడ్డిని చంపింది వాళ్లే… చంపినోళ్లే పేరు వేసుకోవడం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితుల మీద దాడులు, చంపేయడం, శిరోముండనాలు చేయడం, శవాలను ఇళ్లముందు విసిరేయడం, దళితుల 27 పథకాలను రద్దుచేయడం, పథకాలకు అంబేద్కర్ పేరును తీసేయడం.. ఇలా దారుణంగా అంబేద్కరిజంపై దాడి చేసిన ద్రోహి జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అంబేద్కర్ విగ్రహానికి జగన్ రెడ్డి దాత అని కొందరు సిగ్గులేకుండా అంటున్నారు. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా? వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా?
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో అంబేద్కర్ విగ్రహం కట్టారు. పక్క రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 146 కోట్లకు కడితే.. ఇక్కడ రూ. 400 కోట్లు కట్టారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో కూడా రూ. 250 కోట్లు దోచుకున్నారు. దళితుల మీద జగన్ రెడ్డికి ప్రేమ లేదు. అంబేద్కర్ మీద గౌరవం ఉండి, దళితుల మీద ప్రేమ ఉంటే ఒక్క 8 అడుగుల విగ్రహం కూడా పులివెందులలో ఆయన ఇంటిముందు ఎందుకు పెట్టించలేదు ? కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకున్నా కాని జగన్ రెడ్డి ఒప్పుకోకుండా కుట్రకు తెరలేపి సొంత మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలెట్టించాడు.
జగన్ రెడ్డిని ఇంకా నమ్మేవారు ఉన్నారంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకోకడు లేడు. చంద్రబాబును దళితులకు వ్యతిరేకిగా చిత్రీకరించాలని వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరు తెలుసుకున్నారు. అందుకే జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. ప్రధాన మంత్రి సైతం లేచి గౌరవించేలా బాలయోగిలాంటి దళిత నేతలకు చంద్రబాబు గొప్ప స్థానం ఇచ్చారు. దళితులకు 27 పథకాలు ఇచ్చారు.
దళిత బిడ్డలు విదేశాలు వెళ్లి చదువుకుంటే అంబేద్కర్ అంత గొప్పవాళ్లు అవుతారని ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా కానుక అని పేరు పెట్టింది చంద్రబాబే. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను విదేశాలను పింపి చంద్రబాబు చదివించాడు. అలాంటి దళిత బందువైన చంద్రబాబును దళితులకు దూరం చేయాలని విధ్వేషాలు రెచ్చగొట్లాని భయంకరమైన కుట్రలకు తెలరలేపిన జగన్ మోహన్ రెడ్డిని వెంటనే రాష్ట్ర డీజీపీ కంట్రోల్ చేయాలి.
అక్కడ జరిగింది జగన్ మోహన్ రెడ్డి పేరుపైనే దాడి… అంబేద్కర్ విగ్రహంపై కాదు. దాన్ని రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు చూస్తున్నారు. 150 కోట్లతో ప్రపంచ నగరం అమరావతిలో నిర్మించడానికి 30 ఎకరాలను కూడా నాడు చంద్రబాబు కేటాయించారు. అమరావతిని నాశనం చేయాలని.. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెడితే కమ్మ సొదరులు వ్యతిరేకిస్తారు.. అప్పుడు దాన్ని కమ్మలు, దళితులకు మధ్య గొడవగా క్రీయేట్ చేయాలని గత ఎన్నికల ముందు జగన్ రెడ్డి ప్లాన్ చేశాడు.
కమ్మవాళ్లపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దళితులు, కమ్మవాళ్ల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి పట్టిన శని సాక్షి టీవీ, సాక్షీ పేపర్, వైసీపీ పార్టీ. వీళ్ల వల్ల రాష్ట్రానికి పెను ముప్పు ఉంది.. వీళ్లని రాష్ట్రాన్ని తరిమి కొట్టాలి. రాష్ట్ర బాగుకోసం 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు, లోకేష్ లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసుమోదు చేయాలి… కేసు నమోదు చేయుకుంటే ధర్నాకైనా దిగుతాం.