భూమిలో మనుషుల అమృతశాలలైన అన్నక్యాంటీన్లలో ఆహారం తయారీకి నలభీముడిలెక్కన చంద్రుడు చంద్రదాసను ఎందుకు ఎంచుకొన్నాడు?
అన్నదానం ఎందుకు గొప్ప? ఆ అవకాశం మనకు వస్తే?
శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే తన సహజకవచ కుండలాలను కూడా దానం చేసిన కర్ణుడికి, కురుక్షేత్రంలో మరణించాక స్వర్గంలో తాగడానికి నీరు, తినడానికి పిడెకెడు అన్నం దొరకదు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు అన్నీ దొరుకుతున్నా.. అన్నం దొరక్క ఆకలితో అలమటిస్తూ కర్ణుడు అక్కడ విచారిస్తే నువ్వు భూమిలో ఏమి దానం చేశావో అవే దొరుకుతాయి ఇక్కడ అనే సమాధానం దొరుకుతుంది.
దాహం భరించలేక అవమానంతో ఓ మహర్షిని అడుగుతాడు. ఆయన నీ చూపుడు వేలును నోట్లో పెట్టుకో అని చెబుతారు. అలా చేసిన కర్ణుడికి కొంత దాహం తీరుతుంది. ఎందుకంటే ఎవరో ఆకలి అని కర్ణుడి వద్దకు వస్తే.. తాను పెట్టక దుర్యోధనుని ఇళ్లు వైపు చూపించిన వేలు అట అది.
ఆ మాత్రానికే కొంత దాహం తీర్చుకొన్న కర్ణుడు, అక్కడి వారి సాయంతో మళ్లీ భూమి మీదకు శరీరంతో వచ్చి, అన్నదానం చేసి వెళ్లే అవకాశం వస్తుంది కర్ణుడికి. అదే మహాలయ అమావాస్య రోజు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకంటే గొప్పదని ప్రతి మానవత్వం వున్న మనిషికి తెలుసు. కోట్ల రూపాయల సంపద వున్నా కానీ అవకాశం రాదు. తీరిక దొరకదు.
ఒక వేళ అవకాశం వస్తే.. తనూ ఒక చెయ్యి వేస్తాడు.
ఆకలి కన్నా ఆత్మాభిమానం గొప్పదని మనిషి భావిస్తాడు. అందులో తెలుగువాడికి ఆత్మగౌరవం మరింత ఎక్కువ. వచ్చిన వారి వద్ద నామమాత్రంగా రూ.5/- తీసుకొని ఆకలి తీర్చితే సంకోచించకుండా క్షుద్బాధ తీర్చుకొంటాడు.
భూమిలో మనుషుల అమృతశాలలే మన అన్నక్యాంటీన్లు. ఆంధ్రులు అధృష్టవంతులు. మళ్లీ చంద్రబాబు దొరికాడు.ఆ చంద్రబాబుకు మహానుభావుడు నలభీముడి లెక్కన అక్షయపాత్ర చంద్రదాస దొరికారు.
సత్య గౌర చంద్రదాస గారు మన ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు గారు నివశించే పవిత్ర కాకినాడలో.. జేఎన్టీయూలో మెకానికల్ బిటెక్, గోల్డ్ మెడలిస్ట్. ఐఐటి చెన్నై లో.. ఎంటెక్. 1997లో నెట్వర్క్ ప్రపంచంలో నావల్ కంపెనీకి తిరుగులేదు. అందులో పనిచేసేవారు చంద్రదాసగా బెంగుళూరు ఇస్కాన్‌లో చేరకముందు.
ఏడాది క్రితం మా పాత కంపెనీలో డైరెక్టర్ ఒకరు ఇస్కాన్ వాలంటీర్ అయిన ఒక మేనేజరుతో.. మీ ప్రసాదం అదే టిఫిన్స్ చాలా చాలా బావుంటాయి, స్విగ్గీ గానీ జొమోటోలో గానీ తెప్పించుకోవచ్చా? అని అడిగారు. నేను నవ్వితే.. ప్రసాదం కోసం ఇష్కానుకు వెళ్లే వారు వున్నారు అని సదరు డైరక్టర్ అన్నారు.
చంద్రదాస గారు అక్షయపాత్ర ద్వారా అందించే ఆహారం అలా ఉంటుంది. లాభ నష్టాలకు అతీతంగా ఆకలి తీర్చే భువిలో అక్షయపాత్రగా తీర్చిదిద్దారు. అన్నీ సిస్టమేటిక్. వేలమంది వచ్చినా.. ఒక పద్దతి ప్రకారం వడ్డించేస్తారు, అదే రుచి, అదే నాణ్యతతో.
ఒక రాజకీయ నాయకుడిగా సొంత కార్యకర్తలకో, నాయకులకో ఈ క్యాంటీన్లను అప్పగించకుండా.. నిజంగా పేదల ఆకలి తీర్చే అమృతశాలలుగా మార్చడానికి నాయుడు చేస్తున్న సంకల్పం నచ్చి, భాగస్వాములు అవుతున్నారు ఎంతోమంది.
ఆ పుణ్యంలో భాగస్వాములు అవ్వాలని ఎంతోమందికి వుంటుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాతాకు నేరుగా ఆన్లైన్ విధానంలో లేదా చెక్ ద్వారా గానీ ఆ మహా అన్నదాన యజ్ఞంలో మన వంతు పాత్ర పోషించవచ్చు.
Name:- ANNA CANTEENS
A/C.no.37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541
పుట్టినరోజులను ఆడంబరంగా.. గిప్టులు, రిటర్న్ గిప్టులు అని జరుపుకొంటూ.. పెళ్లిల్లలో.. ఇతర పంక్షన్లల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినా వృధా చేస్తుంటాం. ఎంత ఆడంబరంగా చేసినా.. పోలికలతో దెప్పిపొడుపులు వుంటాయి. డబ్బులు ఇవ్వడం కన్నా.. సాటి మనిషికి భువిలో ఆకలి తీర్చే ఈ అన్నక్యాంటీన్లను విస్తరించేలా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించండి. అన్నదాత సుఖీభవ.
– రావి రామ్మోహన్రావు