– ఓర్పు, సహనంతో ప్రజా సమస్యలను పరిష్కరించాలి
– విశాఖ కార్పొరేట్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు
విశాఖపట్నం: ప్రజా ప్రభుత్వం విజయం సాధించడంలో అందరి భాగస్వామ్యం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ పట్టణానికి చెందిన కార్పొరేటర్లతో జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విజయానికి అందరం కలిసి పోరాడాం. కార్పొరేటర్లు ఓర్పు, సహనంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా కార్యకర్తలను విస్మరిస్తారు. అలా జరగకుండా చూడాలన్నారు. కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి నారాయణతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పనిచేయాలన్నారు. విశాఖ, అమరావతి, రాయలసీమలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయన్న మంత్రి.. ఇసుక విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పార్టీ అనుబంధ విభాగాల సభ్యులతో సమావేశమయ్యారు.