Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఒక రూల్.. పబ్లిక్ కి ఒక రూలా?

– డబ్బులు ఢిల్లీకి.. అభివృద్ధి అమరావతికి
-రెమ్యునరేష న్ రేవంత్ రెడ్డికి.. తెడ్డు తెలంగాణ కు
-ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి లక్ష్యం
– హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏమిటి? మంత్రివర్గ ఆమోదం ఉందా?
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి

హైదరాబాద్: హైడ్రాతో హైడ్రామా క్రియేట్ చేసి హైలెవల్ కమిషన్ లు దండుకోవడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. డబ్బులు ఢిల్లీకి.. అభివృద్ధి అమరావతికి. రెమ్యునరేష న్ రేవంత్ రెడ్డికి.. తెడ్డు తెలంగాణ కు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి లక్ష్యం. హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తియ్యాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు.

ఆకస్మిక,అనాలోచిత కూల్చివేతలతో భయబ్రాంతులకు గురిచేసి రియల్ ఎస్టేట్ ను కుదేలు చేసి,పెట్టుబడులను అమరావతికి మళ్లించడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పేదల ఇల్లు కూల్చాలని ఏ చట్టం చెప్పింది? హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏమిటి? మంత్రివర్గ ఆమోదం ఉందా? ప్రతిపక్షాలను, ప్రజా అభిప్రాయం తీసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ లు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ కూల్చివేస్తుంది.

వరంగల్ నగరంలో పేదల ఇళ్ళ జోలికి వస్తే సహించం, అక్రమ కట్టడాలు,కబ్జా స్థలాలు రికవరి చెయ్యండి కానీ పేదల గూడు చెదరగొట్టొద్దు. హైడ్రా కు మేం వ్యతిరేకం కాదు హైడ్రా తో చేస్తున్న హైడ్రామాకు పేదల ఇళ్ళు కూల్చడానికి మేం వ్యతిరేకం. పేదల ఇళ్లను రాత్రికి రాత్రే కూలుస్తూ తమ సోదరుడికి, ఇతర బడాబాబులకు మాత్రం ముందస్తు నోటీసులు ఇస్తారా?

హైడ్రా కు మనిషికోరూల్ ఉంటుందా? హైడ్రా కు బడా బాబులకు ఒక రూలు బక్కచిక్కిన ప్రజలకు ఇంకో రూలా? రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఒక రూల్ పబ్లిక్ కి ఒక రూలా? పేద ప్రజల ఇల్లు నోటీసులు ఇవ్వకుండా కూల్చి, రేవంత్ రెడ్డి తమ్ముడికి మాత్రం నోటీసులు ఇచ్చి ఎందుకు కాలయాపన చేస్తున్నారు?

జులై లో ఏర్పాటైన హైడ్రా నెల రోజుల్లోనే తెలంగాణలో, హైద్రాబాద్ లో ఉన్న చెరువులను కుంటలను, ఆక్రమణలను సర్వే చేసిందా!? హైడ్రా కి ఎటువంటి శాస్త్రీయమైన అధ్యయనం లేదు. అసెంబ్లీలో చర్చ లేదు. కేబినెట్ లో చర్చ లేకుండా కేవలం సంచలనం కోసం,బెదిరింపులకు గురి చెయ్యడానికి రాత్రికి రాత్రే పుట్టిన హైడ్రా ను వాడుకుంటున్నారు.
10 నుండి 15 ఏళ్లు టీడీపీ మినహాయిస్తే, 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలించింది. ఈ నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఒక ఐఏఎస్ పర్మిషన్ లు ఇస్తారు. ఇంకో ఐపీఎస్ వచ్చి కూలుస్తారా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో బడా బాబులే కదా అని అందరూ అనుకున్నారు. తర్వాత మెల్లిమెల్లిగా పేద ప్రజల ఇళ్ళమీదికి రేవంత్ రెడ్డి బుల్డోజర్స్దూసుకెళ్తున్నాయి.
ఇళ్ళు కూల్చిన పేదలకు తక్షణమే ప్రభుత్వం ఇల్లు కట్టించాలి.నష్ట పరిహారం ఇవ్వాలి. పేద ప్రజలు నివసిస్తున్న అస్మత్ పేట, అల్వాల్, సరూర్ నగర్, బోయిన్ బల్లి, రాజీవ్ నగర్, ఖాజాగూడ లో పేదల ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వమే అనుమతి ఇచ్చి ఇంటిపన్నూ,నల్లా పన్ను, కరెంట్ బిల్లులు తీసుకొని ఇన్నాళ్లు నివాసం ఉండటానికి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఆకస్మికంగా కూల్చివేయడం దేనికి సంకేతం.

పట్టా భూముల్లో నిర్మాణాలకు రక్షణ లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటది? నగరాల్లో స్లమ్స్ లో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ కంపెనీ కింద ఏ నాలా ఉందో,ఏ చెరువు ఉందో తెలియక సాఫ్ట్ వేర్ రంగం బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. సాఫ్ట్ వేర్ రంగం లో కూడా చర్చ మొదలైంది.సుమారు30 లక్షల మంది సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు. పెట్టుబడులు అమరావతికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది
కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయింది. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రావడం లేదు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన నాటి నుండి రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయింది. కట్టిన ఇల్లు, ఫ్లాట్ల బుకింగ్ లు నిలిచిపోయాయి. ఇప్పుడు హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతిననీయం.

పట్టా భూముల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలు ఇళ్ళ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చేయడానికి మించిన తుగ్లక్ చర్య వుంటుందా? కాంగ్రెస్ లో పి.జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులు పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం,ఇళ్ల కోసం కృషి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఇందిరమ్మ ఇళ్ళు కట్టించారు. కానీ రేవంత్ రెడ్డి ఇళ్ళు కూలగొడుతున్నారు.

ప్రజా సమస్యలను డైవర్ట్ చెయ్యడానికి,పెట్టుబడులు అమరావతికి తరలించడానికి కుట్ర చేస్తున్నారు. తక్షణమే హైడ్రా విధివిధానాలు రూపొందించాలి. 20,30 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్ళు కూల్చివేతలు ఆపాలి. కూల్చివేసిన ఇళ్లకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి.

LEAVE A RESPONSE