– జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ: నగరానికి వరద విపత్తు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ఆయన శ్రమకు తోడ్పాటుకు స్వచ్చంధ సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులకు ఆహారం అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం బెంజిసర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో పరద బాధితులకు ఏ.పి హెూటల్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వరద బాధతుల కోసం ఆహారం తయారుచేసి స్వచ్ఛంధంగా ప్యాకింగ్ చేస్తున్న వివిధ సంఘాల వారిని, విద్యార్థులను, మహిళలను, యువతను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అభినందించారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హెూదాలో చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయస్సులో కూడా కాలుకు బలవం కట్టుకుని నడుములోతు నీటిలో, గంటల తరబడి ట్రాక్టర్లపై, ప్రాక్షన్పై నిలబడి పరదప్రాంతంలో పర్యటిస్తున్నారన్నారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించి, అధికారులను పరుగులు పెట్టించి వరద బాధితులకు అండగా ఉంటున్నారన్నారు.
వేలాది మందికి ఏ.పి హెూటల్స్ వారు వేడివేడిగా వెజిటబుల్ పలావ్ తయారు చేసి అందిస్తున్నారని వారందరికి నగర ప్రజల తరుపున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. గతంలో కృష్ణా వరదలు చూసి వారికి ఆ కష్టం రాకుండా చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారని, దాని ఫలితమే నేడు ఇంత వరద వచ్చినా కృష్ణలంక ప్రజలు దైర్యంగా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ ఏ.పి అధ్యక్షులు ఆర్.వి. స్వామి, విజయవాడ అధ్యక్షులు పి.వి.రమణ, సభ్యులు రాఘవ, సంజయ్ జైన్ తదితరులు ఉన్నారు.