Suryaa.co.in

Telangana

అసెంబ్లీ కమిటీలపై ఆలస్యమెందుకు?

– రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుగుతున్నారు
– ఆ రాజ్యాంగం తెలంగాణ కు వర్తించదా ?
– మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి,ఎమ్మెల్యే టి .హరీష్ రావు

హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ,ఎస్టిమేట్ కమిటీ ల ఏర్పాటు కు ప్రక్రియ పూర్తయ్యింది. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటి పై ఈ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు?

ఢిల్లీ లో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీ ఏ సీ చైర్మన్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.అక్కడ ఒక రూల్ ..తెలంగాణ లో మరో రూలా? రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుగుతున్నారు ..ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా ?

మండలి లో ప్రతిపక్ష నేతగా మధుసూధనా చారి పేరు ఇచ్చి 40 రోజులు అవుతోందిదాని పై కూడా నిర్ణయం లేదు.ఈ ఆలస్యానికి కారణం ఏమిటీ ?శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విద్యావంతుడు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ,ఎస్టిమేట్ కమిటీ ,మండలిలో ప్రతిపక్ష నేత నియామకాల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్ బాబును కోరుతున్నా.రాహుల్ గాంధీకి ఈ విషయమై ట్వీట్ కూడా చేస్తా

LEAVE A RESPONSE