ఎగిరిపోయిన పక్షుల్లా పిల్లలు
శూన్యపంజరాల్లా ఇంటి లోగిళ్లు
రెక్కలు తెగిన పక్షుల్లా
పండుటాకుల తల్లితండ్రులు
ఎదురు చూపుల వత్తులు
కళ్ళ ప్రమిదల్లో వెలిగిస్తూ
బాధల కన్నీరు తాగుతూ
తమవారి ప్రేమకోసం
తల్లడిల్లే పిచ్చితల్లులు
వయస్సంతా వసంతం లా పిల్లలకిచ్చి
ముసలితనపు శిశిరం కప్పుకుని
మోడులా మిగిలిన మౌనగాథలు
ఆత్మీయతను ఆశించే అమృత మూర్తులు
మమతల కోసం తపించే మరుభూములు
వేదన నిండిన చరితలు
ఆరని అశ్రువుల చిరునామాలు
(సేకరణ)