Suryaa.co.in

Andhra Pradesh

మృతుల కుటుంబాలను వెంటనే ఆదుకుంటున్న ప్రభుత్వం

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
– మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేత

జి.కొండూరు,(గంగినేని): వరద ముంపు బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామానికి చెందిన నన్నేబోయిన వెంకటేశ్వరరావు (42) అదే గ్రామంలో వాగులో వరదముంపునకు గురై గోడ నానిపోవడంతో ఆయన మీద పడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు.

గంగినేని గ్రామంలో మృతుని నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ సాయాన్ని చెక్కు రూపంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించి ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE