Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి ఓటు వేయలేదని మహిళపై రేప్!

– గ్రీవెన్స్ కు బాధితురాలు ఫిర్యాదు
– ఆస్తులు కొట్టేసి కన్నతల్లికి కూడుపెట్టని కొడుకులు
– గ్రీవెన్స్ లో కన్నీటి పర్యంతమైన పండుటాకు

మంగళగిరి: కడుపున పుట్టిన కొడుకులే కనికరంలేని కాలాంతకులుగా మారారని.. తనకు అన్నం పెట్టడం లేదని.. తన పేరు మీద ఉన్న పొలాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేసి.. తననే కొట్టడానికి వస్తున్నారని.. అన్నా క్యాంటీన్ లో అన్నం తిని బతుకుతున్నానని… తనకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలం, గుమ్మనంపాడు గ్రామానికి చెందిన ముక్కపాటి రాజ్యం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన గ్రీవెన్స్ కార్యాక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని.. ఎన్నోసార్లు కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, పీలా గోవింద్ లు ఆమె నుండి అర్జీని స్వీకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి… సంబంధిత అధికారులు, నాయకులకు ఫోన్లు చేసి అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేశారు.

టీడీపీకి ఓటు వేశామన్న కక్షతో ఎస్సీనైన తనపై అత్యాచారం చేసి చంపాలని చూశారని. ఆ ఘటనలో తనకు కాలు చేయి విరిగిందని.. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం తూర్పు పోలినేని పాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బహిర్భూమికి వెళ్ళగా అనుమోలు వెంకటేశ్వర్లు, అనుమోలు లక్ష్మీనరసింహంలు తనపై రేప్ చేయించారని బండ్ల లక్ష్మమ్మ మనవడు తనను రేప్ చేశాడని.. వీరిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె నేడు గ్రీవెన్స్ లో వేడుకున్నారు. ఈ సందర్భంగా నేతలు స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి.. సమస్య ను వివరించి దోషులను శిక్షపడేలా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణానికి చెందిన ముప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ.. తాను పామర్రు మండలం గుమ్మలముపాడు గ్రామంలో 2002 లో కొనుగోలు చేసిన తన భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదు అయ్యి ఆన్ లైన్ అయ్యిందని.. అయినా కూడా దురుద్దేశంతో అబ్బూరి శేషయ్య, చావా హరికృష్ణలు ఫోర్జరీ డాక్యూమెంట్లు సృష్టించి తన భూమిని కొట్టేసేందుకు కుట్ర చేయగా.. కేసు పెడితే దానిపై వారు అరెస్ట్ కూడా అయ్యారని.. తమ పిల్లలు అమెరికాలో ఉండటంతో తమను చంపితే ఇక ఆస్తుల కోసం వారు ఇక్కడకు రారనే దురుద్దేశంతో శేషయ్య, హరికృష్ణలు కుట్ర పన్నారని.. ఆయన నేడు గ్రీవెన్స్ లో నేతలను కలిసి ఫిర్యాదు చేశారు. వారి నుండి ప్రాణ హాణి ఉందని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మిగుంపుల సుబ్బమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తనకు తన మామగారి నుండి వారసత్వంగా వచ్చిన భూమి ఆన్ లైన్ లో తప్పుల తడకగా ఉందని.. వారసత్వంగా వచ్చిన భూమి కొనుగోలుగా పడిందని.. ఉన్న కాస్త భూమిలో కూడా మరోకరి పేరు మీద ఎక్కిందని.. వారసత్వంగా వచ్చిన భూమి ఆన్ లైన్ లో ఎక్కకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని.. తమ భూమి ఆన్ లైన్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేసింది.

తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్స్ పోటెత్తారు. చాలీచాలని జీతంతో సంవత్సరాలుగా పనిచేస్తున్నామని.. వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాని వేడుకున్నారు. సుమారు 100 మందికిపైగా వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన గోనుగుంట వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమికి విడవలపాటి మాల్యాద్రినాయుడు దొంగ పత్రాలు సృష్టించి తమ పాసు పుస్తకాలను రద్దు చేయించాడని, ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని.. న్యాయం చేయాలని.. ఆయన వేడుకున్నారు. తన పేరుతో పాస్ పుస్తకాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం, ఉప్పలరాపల్లి గ్రామానికి చెందిన అప్పారావు విజ్ఞప్తి చేస్తూ.. వాకపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిని నావిక ప్రత్యామ్నాయ స్థావరం (ఎన్.ఏ.ఓ.బి) నిర్మాణానికి తీసుకుని నేటికి పరిహారం ఇవ్వలేదని దాంతో ఆర్థిక నష్టాలతో రోడ్డున పడ్డామని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొండూరు గ్రామ రైతులు, రైతు కూలీలు విజ్ఞప్తి చేస్తూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో ఉన్న డొంక రోడ్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయని.. నడవడానికి వీల్లేకుండా పోయాయని దయచేసి వాటికి మరమ్మతులు చేపట్టాలని వేడుకున్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం, మైసన్నగూడెంలో తనకు తన అమ్మగారి నుండి వచ్చిన భూమిని రీసర్వే పేరుతో గ్రామ సర్పంచ్ అధికారులు కలిసి ఇతరుల పేరుపైకి మార్చి తనకు అన్యాయం చేశారని.. ఈ అన్యాయానికి పాల్పడిన వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామదేవులపాడు గ్రామానికి చెందిన నూతలపాటి నారాయణ విజ్ఞప్తి చేస్తూ.. తనకు కరోనా టైంలో ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కళ్లు పోయాయని.. నేడు గుండె సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నానని వెంటనే చికిత్స అందకుంటే ప్రాణాలు నిలబడవని.. తనకు సాయం చేసి ఆదుకోవాలని నేతలకు విజ్ఞప్తి చేయగా.. స్పందించిన నేతలు… సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపారు.

LEAVE A RESPONSE