– వేలాది పాఠశాలలను మూసివేసిన ఘనుడివి నువ్వే..
– టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత నీదే..
– ఏపీ మహిళ, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
విజయవాడ: ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో తెలియదు.. ఏ స్కూలో తెలియదు… ఏ కాలేజీయో అస్సలు తెలియదు. నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల గురించి, స్టేట్ & సెట్రల్ సిలబస్ గురించి లెక్చర్ ఇవ్వడం చాలా వింతగా, విడ్డూరంగా ఉంది.. జగన్! అని ఏపీ మహిళ, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.
మంత్రి లోకేష్ చదువు ఏమిటో నీకు తెలుసా? విదేశాల్లో చదివిన బెస్ట్ స్టూడెంట్ …. కాలిఫోర్నియాలో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తెలివైన వ్యక్తి.. అతని విజ్ఞానం ముందు నీవెంత జగన్? అతని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా జగన్? కనీస అవగాహన లేకుండా, రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నువ్వు తీసుకున్న నిర్ణయం వలన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం, టీచర్ లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం, టీచర్లకు మరుగుదొడ్ల ఫోటోలు పెట్టమని ఒత్తిడి చేయడం లాంటి పనులు చేసిన నీ ఘనత ప్రజలు మరచిపోకుండా నిన్ను ఇంటికి పంపారు .. ఇప్పటికైనా పిచ్చిమాటలు మానుకో అని హితవు పలికారు.