Suryaa.co.in

Andhra Pradesh

టూరిజం యాప్‌ రూపొందించిన హైస్కూల్‌ విద్యార్థి

– యాప్ ఆవిష్కరించి, ధీరజ్‌ ను అభినందించిన మంత్రి సవిత

అమరావతి: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ధీరజ్ తయారు చేసిన మొబైల్ యాప్ ను బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆవిష్కరించి, ఆ విద్యార్థిని అభినందించారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గోరంట్ల పట్టణానికి చెందిన గంధం ధీరజ్ ఈ యాప్ తయారు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లోని గల వివిధ పర్యాటక ప్రాంత వివరాలను, వాటి ప్రాముఖ్యతను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో తెలియజేస్తూ ఈ యాప్‌లో పొందుపరిచారు.

ఈ యాప్… ఏయే పర్యాటక ప్రాంతం ఎంత దూరంలో ఉన్నదో తెలుపుతుందని, అలాగే, ఒకే స్క్రీన్ పై అన్ని పర్యాటక ప్రాంతాల దూరాలను కూడా చెబుతుంది. ఆ ప్రాంతానికి రూట్ మ్యాప్ కూడా చూపిస్తుందని ధీరజ్‌ మంత్రికి వివరించారు. అలాగే ప్రస్తుతం ధీరజ్ తయారుచేస్తున్న మరికొన్ని మొబైల్ అప్లికేషన్ గురించి తెలుసుకుని ఆమె అభినందించారు. ఇంత చిన్న వయస్సులోనే ధీరజ్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని నీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ యాప్ ను ప్లే స్టోర్ లో SSSD Tourism అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?
id=org.dheeraj.sssdfinal&pcampaignid=web_share

LEAVE A RESPONSE