- లింగవరం గ్రామంలో రూ.50 లక్షలో నిధులతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు
- అభివృద్దేకాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లు
- ఎమ్మెల్యే రాము
గుడివాడ రూరల్:గుడివాడ ప్రగతిలో ప్రతి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. అభివృద్దే కాదు….ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపినప్పుడే నేను విజయం సాధించినట్లని ఆయన పేర్కొన్నారు.
గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో ఎన్ఆర్జిఎస్ నిధులు రూ.35.60 లక్షలతో 8 సి.సి రోడ్లు…డిఎంఎఫ్ నిధులు రూ.10 లక్షలతో ఒక సీసీ రోడ్డు….. ఎస్డిఆర్ఎఫ్ నిధులు రూ.5.60 లక్షలతో సిసి రోడ్డు…. మొత్తం రూ.51.20 లక్షల నిధులతో నిర్మించనున్న 10 సిసి రోడ్ల నిర్మాణ పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గుడివాడ మండలంలోని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి వివిధ శాఖల నుండి…రూ.17.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. మంజూరైన నిధులతో మూడు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు…. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా…..గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజల సంతకాలతో వస్తేనే కాంట్రాక్టర్ కు నిధులు విడుదల చేస్తామని ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా తెలియజేశారు.
గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి కులాయి ఏర్పాటుకు…… ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని….. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, బిజెపి కన్వీనర్ దావూలూరి సురేంద్రబాబు, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, తాసిల్దార్ వి.రామకోటేశ్వరరావు, ఎండిఓ ఏవి రమణ, టిడిపి నాయకులు కాటూరి జాన్ శ్యామ్యూల్,చెవూరు జగన్మోహనరావు, చిరంజీవి రెడ్డి, గాదిరెడ్డి చిన్నబాబు, పెనుబోలు శ్రీను, కంచర్ల సుధాకర్, మార్క్ రాజ్
మందపాటి గోపాలస్వామి,, బర్మా తారక రామారావు, గంధం రంగబాబు, కాటూరి ఏసు పాదం, కలపాల మాణిక్యాలరావు, చొప్పర లోకేష్ ప్రసాద్, కొప్పుల కోటయ్య, కొత్తకోట నాగరాజువసంతవాడ దుర్గారావు, కైలా రంజిత్ కుమార్,పలు ప్రభుత్వ శాఖల అధికారులు…. ఎన్డీఏ కుటుంబ పార్టీల నాయకులు… గ్రామస్తులు పాల్గొన్నారు.