– ఇప్పటికే 12లక్షల సభ్యత్వాలు పూర్తి
– బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: గత రాష్ట్ర ప్రభుత్వం లో ప్రజల పక్షాన గళం విప్పాం. ఇసుక, మద్యం మాఫియా పై బిజెపి ఉద్యమం చేసింది. పోలవరం, రైల్వే జోన్, అమరావతి రాజధాని కి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తోంది. స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో పెడతాం.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం ప్రజల కోసం అమలు చేస్తుంది. నేడు ఏపీలో యన్డీఎ కూటమి ఆధ్వర్యంలో మంచి పాలన సాగుతుంది. వైసీపీ పాలనలో 13 జిల్లాల్లో వారికి నచ్చిన వారికి ఇసుక రీచ్ లు కట్టబెట్టి దోపిడీ చేశారు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. బీజేపీ ప్రజల పక్షాన నిలబడి, వారి కోసం వారితో కలిసి నడవాలి. తిరుమల లడ్డూ ప్రసాదానికి కూడా అపచారం కల్పించారు. అన్య మతస్తులను టీటీడీ బోర్డులో వద్దన్నా కూడా, ఆనాడు వినలేదు.
లక్షలాది మంది సంతకాల సేకరణ చేసి ఇచ్చినా జగన్ పట్టించుకోలేదు. కేంద్ర బడ్జెట్ లో కూడా రాష్ట్ర అభివృద్దికి మోడీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేసి, రైతుల కల నెరవేరుస్తా. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ పై కొంతమంది రాద్దాంతం చేస్తున్నారు. లాభాల బాటలో ఎలా పట్టించాలనే దానిపై, ఇటీవల సీఎం చంద్రబాబు కూడా సమీక్ష చేశారు.
ఇప్పుడు ఉన్న భాగస్వామ్యాన్ని అదే విధంగా కొనసాగిస్తూ, లాభాల పట్టేలా కార్యాచరణ రూపొందిస్తాం. గత ప్రభుత్వం భూమిని కేటాయించాలంటే, నిరుపయోగమైన భూమిని ఇచ్చారు. కానీ నిందలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై వేసి తప్పుకున్నారు.
ప్రైవేటీకరణ పేరుతో గత ప్రభుత్వం చేసిన అసత్యాలను తిప్పి కొట్టాలి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భూమిని కేటాయించారు. గ్రామాలు అభివృద్ది చెందకుండా, నిధులు మొత్తం జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. కూటమి వచ్చాక 13వేల పైబడి పంచాయతీల్లో, పవన్ కళ్యాణ్ ఒకే సమయంలో గ్రామ సభలు నిర్వహించారు.
ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటించింది. సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చాలని జగన్ కుట్ర చేశారు. మద్యం పై జరిగిన అవినీతి పైనా బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. నాణ్యత లేని మద్యం, డిజిటల్ పేమెంట్ల ద్వారా గత ప్రభుత్వం మద్యం వ్యాపారిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధానానికి స్వస్తి పలికి, కొత్త విధానం అమల్లోకి తెస్తుంది.
ఏపీ అభివృద్దికి అన్ని విధాలా కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుంది. రాజధాని నిర్మాణం, పోలవరం, వంటి అంశాలలో కీలక పాత్ర కేంద్రం పోషిస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి అవగాహన కల్పించాలి. అవినీతిరహిత పార్టీగా బీజేపీకి దేశ వ్యాప్తంగా పేరు ఉంది.
అటువంటి పార్టీలో చేరేలా ప్రజలను కూడా చైతన్య పరచాలి.రెండు వారాల వ్యవధి ఉన్న నేపధ్యంలో సభ్యత్వ నమోదు మరింత పెంచాలి. ఇప్పటికే 12లక్షలు పూర్తి చేశాం. ఈ సంఖ్య మరింతగా పెంచేలా అందరూ కలిసి పని చేయాలి. సభ్యత్వ నమోదు మరింత వేగం పెంచాలని పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు.
కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కృష్ణ దాస్, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, జోనల్ ఇంఛార్జి లు సురేంద్ర మోహన్,మట్టా ప్రసాద్, వల్లూరు జయప్రకాష్ పాల్గొన్నారు.