Suryaa.co.in

Andhra Pradesh

హిందూ ధార్మిక భక్తుల విజయం….

  • హిందూ ధార్మిక విధానాలపై జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు…
  • జగన్ మతం మానవత్వం అయితే ముఖ్యమంత్రి కాలంలో ఎన్ని హత్యలు, ఎన్ని అరాచకాలు జరిగాయి ఇదేనా జగన్ మానవత్వం…
  • చంద్రబాబు దేవుళ్ళ విషయాల్లో రాజకీయాలు చేయట్లేదు, టిటిడి డిక్లరేషన్ పై సంతకాలు చేయకుండా కుట్ర రాజకీయం చేస్తుంది జగన్…
  • తిరుమల పర్యటనలో నీ పార్టీ శ్రేణులు అరాచకాలు సృష్టిస్తారని పోలీసులు సెక్షన్ 30 నోటీసులు ఇస్తే.. దాన్ని కూడా నీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటావా….,

అమరావతి:బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, వావిలాల కుమార్ మాట్లాడుతూ తిరుమల పై యుద్ధం చేసేందుకు కోసం వైఎస్ జగన్ కుట్రపన్ని హిందూ ధార్మిక సంఘాలను సనాతన ధర్మ వాదులను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలను రెచ్చగొట్టే విధంగా తాను తిరుమలకు రేపటి రోజు 28వ తారీకున అలిపిరి నుండి నడుచుకుంటూ వస్తానని ప్రకటన చేయటం హాస్యాస్పదంగా ఉంది.

జగన్ ముత్తాతల నుంచి మతం తరతరాలుగా నేటి వరకు అన్య మతాన్ని స్వీకరించినట్లు రికార్డులు తెలుపుతున్నాయని, జగన్ వివాహం కూడా అన్యమత సాంప్రదాయంలో జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడుతూ తాను 11 సార్లు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారని ఏనాడు దిక్లరేషన్ సంతకం అడగలేదని అధికారులు పైన నెపం వేశాడు, టీటీడీ అధికారులు దీనిపైన వివరణ ఇవ్వాలనీ సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 11 సార్లు అన్నిట్లో డిక్లరేషన్ రిజిస్టషన్ పుస్తకాల్లో సంతకాలు పెట్టకుండా పుస్తకాలు తెచ్చిన అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించి పుస్తకాలు విసిరి వేయలేదా జగన్ అని ప్రశ్నించారు.

డిక్లరేషన్ పై సంతకాలు చేయకుండా స్వామివారిని 11సార్లు దర్శించినందుకు గాను మొన్నటి ఎన్నికల్లో స్వామివారు 11 సీట్ల వరకే పరిమితం చేశారని, ఈ 11 సార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల వచ్చి ఉంటే తనతో పాటు స్వామి వారి దగ్గరికి తన భార్య భారతీ, తన కుమార్తెలను ఎందుకు తిరుమల తీసుకు వెళ్లలేదని నాయకులు ప్రశ్నించారు. 11 సార్లు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒక్కసారి కూడా వారు తిరుమల రావటానికి వీలుపడలేదా అని జగన్ ని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా సతీమణితో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది తిరుమల రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందని ఇది రాజుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని, జగన్ తన భార్య పక్కన పెట్టుకొని స్వామివారికి ఎందుకు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించలేదని, స్వామివారి పట్ల జగన్కు ఉన్న విశ్వాసం ఇదేనా, వెంకటేశ్వర స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం భక్తి ప్రపత్తులు, నమ్మకం అని ప్రశ్నించారు, వీటికి జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో కలియుగ దైవం పట్ల తాను తప్పులు చేసి, ఆ నెపాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద, బిజెపి నాయకత్వం మీద నెట్టివేయడం ఎంతవరకు సబబు. నువ్వు ఏ మాటలు చెపితే ఆ మాయ మాటలు వినే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని, నిన్ను నమ్మే స్థితిలో కూడా లేరని, దానికి పర్యవసానమే మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ ని 11 సీట్లకు పరిమితం చేయటం జరిగింది గుర్తులేదా, ఇదే కలియుగ ప్రత్యక్ష దైవం జగన్ కి వేసిన శిక్ష కదా, తిరుమల వెంకన్నను స్వార్థ రాజకీయాలకి వాడుకోవడం మానుకోవాలని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను నరికేసి, రథాలు తగలబెట్టి,వెండి సింహం విగ్రహాలు మాయం చేసి, దేవాలయాల్లో మూలవిరాట్లు ఎదురుగానే దేవాలయ అర్చకులు పై దాడులు చేస్తున్నప్పుడు హిందూ ధర్మం, ఆధ్యాత్మిక విశ్వాసం పై దాడులుగా నువ్వు భావించలేదని నాయకులు ప్రశ్నించారు.

ప్రెస్మీట్లో డిక్లరేషన్ పై ఎటువంటి వివరణ ఇవ్వకుండా కప్పదాటు మాటలు మాట్లాడటాన్ని హిందూ ధార్మిక ప్రజలందరూ గమనించారని, భవిష్యత్తులో తగు రీతిలో ప్రజలే బుద్ధి చెప్తారని నాయకులు జగన్ను హెచ్చరించారు. అసలు జగన్మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేస్తాడో చేయడో అనేది ఆంధ్ర ప్రజలకు తెలియజేయాల్సిన నైతిక బాధ్యత ఉందని, దీన్ని గనక విస్మరిస్తే తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి రాజకీయ సమాధి చేస్తారని జేఏసీ నాయకుల హెచ్చరించారు.

జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవటం సనాతన ధార్మిక ప్రజల విజయమని, భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తే ముందే డిక్లరేషన్ సంతకం చేస్తానని ప్రకటిస్తేనే తిరుమల కొండపై కాలు పెట్టనిస్తామని లేని పక్షంలో స్వామీజీలు, హిందూధర్మిక సంఘాలు, వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు కచ్చితంగా అడ్డుకొని తీరుతాయని నాయకులు జేఏసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బృందావనం గోపిచంద్, పరాశరం జగన్మోహన్, పార్వతి, నందివెలుగు శేషగిరిరావు, పెద్దింటి కృష్ణ చైతన్య, వడ్డమాను ప్రసాదు, వడ్లమూడి నాగేశ్వరరావు, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE