– దుండిగల్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి కృతజ్ఞతలు. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషం. సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే చోట అభివృద్ధి జరుగుతుంది.కష్టాలతో వచ్చిన ప్రజలకు ఈ మంటపం ప్రశాంతతను ప్రసాదిస్తుందని నమ్ముతున్న. మైసూర్ లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ ఇక్కడ నిర్వహించడం సంతోషం. ఇది తెలంగాణకు శుభ సూచకం. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.