Suryaa.co.in

Telangana

ఇల్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయం

– మూసీ ప్రక్షాళన కొరకు టెండర్లు ఎవరు పిలిచారు?
– ప్రాజెక్టు నిర్మాణానికి 1.50 లక్షల కోట్లు రూపాయల వ్యయం అవుతుందని ఎవరు చెప్పారు?
– ప్రజా భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్: నగరంలోని చెరువులు సీఎం రేవంత్ రెడ్డి వి, నావి కావు. ఇవి నగర ప్రజల ఆస్తి. వీటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఎజెండా. అన్యాక్రాంతమవుతున్న చెరువులను రక్షించే బాధ్యత కేవలం సీఎం రేవంత్ రెడ్డిది, నాది కాదు. ఇకనైనా ఈ చెరువు లను రక్షించకపోతే కనపడవు.

విశ్వనగరం గా పిలుచుకుంటున్న హైదరాబాద్, ప్రపంచాన్ని ఆకర్షించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ ప్రక్షాళన కొరకు టెండర్లు ఎవరు పిలిచారు? ప్రాజెక్టు నిర్మాణానికి 1.50 లక్షల కోట్లు రూపాయల వ్యయం అవుతుందని ఎవరు చెప్పారు?

మూసి పునర్జీవనం అంశంలో ఎవరు చెప్పినా వినడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ద్వారాలు తెరిచే ఉంచాం. ఏం చేస్తే ఎలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో చెప్పండి.ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ప్రజా ప్రభుత్వానికి లేదు.

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని మీకు ఉందా లేదా? మీ వైఖరి బహిర్గతంగా చెప్పండి.ప్రస్తుతం FTL చెరువుల ఆక్రమణ పైనే దృష్టి పెట్టాం ఆ పై వాటికి పోవడం లేదు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లో సబర్మతి నదిని, ఇప్పుడు మాట్లాడుతున్న వారికి ప్రక్షాళన చేసిన విషయం తెలియదా?

రేవంత్ రెడ్డి ఖబర్దార్ అనేవాళ్లు ఎందుకు అంటున్నారో చెప్పాలి. ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మూసిని పునర్జీవనం చేయడానికి, చెరువులను కాపాడుకోవడానికి, ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఎజెండా. ఎవరిని నష్టపరిచే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయదు, చేయబోదు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజలకు ఏం మంచి చేయాలో చెప్పండి.

మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయం. ఏ సాయం చేయడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇండ్ల పట్టాలు లేకుండా మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్న వారిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది.

LEAVE A RESPONSE