Suryaa.co.in

Family

అవును.. నాన్న గొప్పోడు!

నాన్న పిల్లల రక్షకుడు.
పెళ్లి లో అమ్మమెడలో తాళి కట్టేది నాన్నే!
అమ్మ కూర్చుంటుంది దర్జాగా!
నాన్న నిలబడి కడతాడు. అమ్మ తలవంచుతుంది.
అదే ఆఖరు నాన్న ముందు తలవంచడం.
నాన్న ముందుగా ఏడడుగులు నడుస్తాడు. వెనకాల అమ్మ అనుకరిస్తుంది (నిజంగా అప్పటికి వాళ్ళు అమ్మ నాన్న కాదు. వధూవరులు మాత్రమే)
అమ్మ అవ్వాలంటే నాన్న అనేవాడు ఉండాలి. నాన్న లేని అమ్మకు సమాజంలో విలువ లేదు. ఆ విధంగా నాన్న గొప్పవాడే.
పెళ్ళైయాక అమ్మకు పిల్లలు పుట్టినా, పిల్లలకు వారి జీవితాంతం నాన్న కేరాఫ్ అడ్రస్ గా మారతాడు. ఆ గౌరవం చాలదా నాన్నకి?
నాన్న వున్నా లేకపోయినా నాన్న పేరు, వాళ్ళ జీవితాంతం వారికీ అవసరమవుతుంది. ఆ సంతోషం చాలదా నాన్నకి? నాన్న అంటే అమ్మ దృష్టిలో శ్రీవారు. అంటే అదే వెంకటేశ్వర స్వామి తో సమానం. అది చాలదా మగాడు ఆనందపడడానికి?
ఇంకా పితృవాక్య పరిపాలకుడు అంటారు. అది నాన్నకి గౌరవం కదా?
తన పిల్లలు తనకంటే గొప్పవాళ్లైనప్పుడు, ఆ నాన్న కళ్ళలో ఆనందభాష్పాలకు విలువ కట్టగలమా?

– డా. పి. రమేష్ కుమార్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9390044034

LEAVE A RESPONSE