సూర్యాపేట: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి ఉదయం 10:30 గంటలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంల రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ,సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ అర్చన, తుంగతుర్తి మున్సిపల్ చైర్మన్ అనసూయ, జిల్లా ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్వాగతం పలికారు.
జిల్లా నుండి వివిధ రంగాలలో ప్రాముఖ్యత పొందిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ , డాక్టర్ నంద గోపాల్, డాక్టర్ ఆనంద్ హెగ్డే, కవి పెద్దిరెడ్డి గణేష్, క్రీడా కారులు రవీందర్ రెడ్డి, అనిల్ కుమార్,సుదర్శన్ రెడ్డి,దివ్య భవాని పేరిణి నృత్య కారుడు రాజ్ కుమార్,ఉపాధ్యాయులు మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి ఉమరాణి, పారిశ్రామిక వేత్తలు మీలా మహాదేవ్,రమణ మూర్తి, రమేష్ బాబు,ప్రకృతి వ్యవసాయవేత్తలు శేషు కుమార్, గోపయ్య, కళాకారులూ భద్రాయ చారి, ముస్తఫా లాంటి ప్రముఖులతో గవర్నర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు.