– రైతులు కల్లాల దగ్గర వడ్లు అరబోసుకుంటున్నారు
– వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది
-500 రూపాయల బోనస్ ఎగ్గొట్టడానికే
– బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో నామమాత్రపు కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు.ఆర్భాటంగా 4,5 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఫోటోలకు ఫోజులిచ్చిచ్చారు. రైస్ మిల్స్ అలాట్మెంట్ ఇంకా చేయలేదు.
రైతులు కల్లాల దగ్గర వడ్లు అరబోసుకుంటున్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5 రోజులైనా ఇంకా ప్రభుత్వం కొనటం లేదు.దరిమిలా రైతులు మధ్య దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మద్దతు ధర 2300 మీరు ఇస్తానన్న బోనస్ 500 కలిపి క్వింటాలు 2800 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లు జోకటం లేదు. రైతులు ప్రైవేట్ దళారులకు 2100 అమ్ముకొని 700 నష్టపోతున్నారు.
గత పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ కూడా మధ్య దళారులకు వడ్లు అమ్మకోలేదు.కేసీఆర్ ఉన్న కాలంలో రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకున్నారు. పడేండ్లలో మొదటి సారి రైతులు దళారులకు అమ్మనకుంటున్నారు..ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు? పంట కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది.
రైతుల దగ్గర పంట కొన్న ప్రైవేట్ దళారులు మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినయి. కొనుగోలు కేంద్రాలు లెట్ చేయడం వల్ల రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటున్నారు. 500 రూపాయల బోనస్ ఎగ్గొట్టడానికే ప్రభుత్వం వడ్లు కొనడంలో జాప్యం చేస్తుంది.
అగ్రికల్చర్ పోర్టల్ లో ప్రతి రైతు పండించిన పంట లెక్కలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మిన వారికి కూడా ఎకరానికి 26 క్వింటాళ్లతో ప్రతి క్వింటాలుకు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి.కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రైస్ మిల్స్ అలాట్మెంట్ చేయాలి,అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వమే ప్రతి గింజ కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు.