– జూపల్లి మంత్రి అయ్యాక బెల్టు షాపులు పెరిగాయి
– మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ,బీఆర్ఎస్ నేతలు అభిలాష్ రంగినేని ,కురువ విజయ్ కుమార్
కొల్లాపూర్: కేటీఆర్,హరీష్ రావును విమర్శించకపోతే మంత్రులకు
పూట గడవడం లేదు. మంత్రి జాపల్లి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు
రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. జూపల్లికి రాజకీయ విలువలు లేవు. జూపల్లి మంత్రి అయ్యాక బెల్టు షాపులు పెరిగాయి.
టూరిజం శాఖ మంత్రిగా ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో జూపల్లి చెప్పాలి. హరీష్ రావు కంటే ముందు జాపల్లి ఎమ్మెల్యే అయ్యారు.సిద్దిపేట లాగా కొల్లాపూర్ ను జూపల్లి ఎందుకు అరెస్టు చేయలేదు? సంవత్సరంలో జూపల్లి చేసిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్దం. జూపల్లి ఇప్పటి వరకు నాలుగు దేశాలు తిరిగివచ్చారు.
మేము జూపల్లి కంటే ఎక్కువ భాష మాట్లాడగలం. మేము వయస్సుకు,మంత్రి పదవికి గౌరవం ఇస్తున్నాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణించాయి. జూపల్లి కేసులు పెట్టి వేధిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి ఆరు నెలలు అయింది. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి.
కొల్లాపూర్నియోజకవర్గంలో యజమానులకు తెలియకుండా పట్టాలు మారుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలో పొలిటికల్ దాడులు ఆపాలి. హామీలు అమలు చేయలేక డైవర్ట్ చేయడానికి పొంగులేటి పొలిటికల్ బాంబులు పేలుతాయని అంటున్నారు.
గద్వాల జిల్లాలో రాజకీయాన్ని జూపల్లి క్రీడగా మార్చారు. బిఆర్ఎస్ నుండి గెలిచిన గద్వాల ఎమ్మెల్యేను జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో బాలిక పని చేసింది. ఇంట్లో గొలుసు పోయిందని బాలికను పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత్రహింసలు పెట్టారు. ఆ బాలిక సూసైడ్ చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
జూపల్లి కృష్ణారావు కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సోదరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మంత్రివర్గం నుండి జూపల్లిని బర్తరఫ్ చేయాలి.