విశాఖ: శారదా పీఠానికి చంద్రబాబు సర్కారు మరో బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాలకు అనుమతులు రద్దు చేసింది.గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో భూమి లీజుకు ఇచ్చారు.అయితే, నిబంధనలు అతిక్రమించారంటూ అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.