Suryaa.co.in

Political News

అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్.. అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం అమరావతి అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. ఏ రాష్ట్రానికి లేనంతగా 54 వేల ఎకరాల రాష్ట్ర రాజధాని, విశాలమైన రోడ్ల వసతి, ప్రణాళిక ప్రకారం నవ నగరాల నిర్మాణం, హైవేల నుండి (చెన్నై కోల్ కత్త ,హైదరాబాద్ విజయవాడ) కనెక్టివిటీ, విజయవాడ నుండి అమరావతి కి రైలు వసతి, 188 కిలోమీటర్ల తూర్పు, పశ్చిమ రింగ్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. కృష్ణా నది మీద మూడు బ్రిడ్జిలు అమరావతిని కలపబోతున్నాయి.

అమరావతి నవనగరాల నిర్మాణానికి మొదటి ప్రణాళికలో ప్రస్తుత ధరల ప్రకారం 26 వేల కోట్లు కావాలని ప్రణాళిక తయారు చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం 15,0000 కోట్లు గ్రాంట్ గా మంజూరు చేసింది. 11 వేల కోట్ల రూపాయలు హడ్కో నుండి లోన్ మంజూరు కాబోతుంది. అనుకున్న ప్రణాళిక ప్రకారం.. డబ్బు వసతి పూర్తిగా విడతల వారీగా బ్యాంకులకు వచ్చిన తర్వాత, డబ్బు గురించి ఆలోచించే అవసరం లేకుండా నిర్మాణరంగం ముందుకు పోతూ ఉంది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగే ప్రాజెక్టు కాబట్టి, అనుకున్న ప్రకారం నిధులు మంజూరు చేస్తూ ఆర్థికపరమైన విషయాలలో ఆలోచించకుండా, పోలవరం ప్రాజెక్టు జమా ఖర్చు లెక్కలకు (నిధులు దారి మళ్ల కుండా) సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, కేంద్రం నుంచి నిధులు నేరుగా ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఇచ్చిన నిధులకు.. ఎప్పటికప్పుడు యుటిలిటీ సర్టిఫికెట్లు కేంద్రానికి పంపిస్తూ, ప్రాజెక్ట్ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు పోతుంది.

కేంద్రం కూడా కచ్చితంగా డిజైన్ లో కానీ, ప్లానింగ్ లో కానీ, అకౌంట్బులిటి లో కానీ ఎప్పటికపుడు నిఘా పెట్టి పర్యవేక్షిస్తుంది (ప్రాజెక్టు పూర్తయి రైతులకు నీరు ఇచ్చే సమయం) నిర్ణయం చేసి 2026 కల్లా మొదటి దశ పూర్తి కావాలని నియమం పెట్టింది.

ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. అదేవిధంగా విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దబోతున్నారు. కేవలం విశాఖ సిటీ కి సంబంధించి 26 వేలకోట్లతో రింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా సాగుతుంది. 2025 కల్లా మొదటి దశ పూర్తవుతుంది. విశాఖపట్నం రైల్వే డివిజన్ కు మంజూరు చేసిన స్థలాన్ని కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో భూమి పూజ చేసి దానికి కూడా టెండర్లు పిలవబోతున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సినిమా పరిశ్రమ విశాఖపట్నం కేంద్రంగా ఆలోచన మొదలైంది. రెండు మూడు స్టూడియోలు కూడా నిర్మాణం జరిగి ఉంది దాని ప్రకృతి అందాలు, వనరులు ఎలాగూ ఉన్నాయి . విశాఖపట్టణాన్ని సాఫ్ట్వేర్ కేంద్రంగా నిర్ణయం చేసి, ప్రణాళిక ప్రకారం కంపెనీలు వస్తున్నాయి. గతంలోనే ఆ నగరం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉంది.

ఆంధ్రప్రదేశ్ అదృష్టం 975 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండడం. సీపోర్టులు విరివిగా నిర్మాణం చేసుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఎగుమతి, దిగుమతి రంగాలలో మంచి అభివృద్ధి సాధించబోతుంది. విశాఖ, చెన్నై కారిడార్, చెన్నై, బెంగళూరు కారిడార్ నిర్మాణాలు జరగబోతున్నాయి.

రైల్వే ప్రాజెక్టులు, ఆర్ఓబీలు, విజయవాడ చెన్నై 3వ లైను ప్రారంభమై పట్టాలెక్కేసింది. ప్రస్తుతం విజయవాడ చెన్నై నాలుగో లైన్ కి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గూడూరు తిరుపతి మూడవ లైన్ ప్రణాళికలు రచిస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి రైల్వే లైన్ ను డబుల్ లైన్ చేస్తున్నారు దానికి ఎలక్ట్రిసిటీ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఆరు కొత్త రైల్వే లైన్లు తిరిగి పట్టా లెక్క బోతున్నాయి.మెట్రో రైలు సౌకార్యం విజయవాడ నుండీ అమరావతి కి కేంద్ర సహకారంతో జరుగబోతుంది.

గతంలో ఉన్న అపవాదు తొలగి.. రాష్ట్రంలో విరివిగా వర్షాలు పడి నదులు, చెరువులు ప్రాజెక్టులన్నీ నిండు నీటితో కళ కళాడుతున్నాయి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను, త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

వ్యవసాయ రంగం కూడా సమృద్ధిగా నీరు ఉంది కాబట్టి.. మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. వ్యవసాయం తక్కువ ఖర్చులో, ఎక్కువ దిగుబడి ఫలితాలు సాధించేందుకు.. డ్రోన్ వ్యవస్థ టెక్నాలజీ పెరిగి తద్వారా వ్యవసాయానికి ఖర్చు తగ్గబోతుంది.

దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం డ్రోన్ సమ్మిట్ నిర్వహించి, పున్నమి ఘాట్ లో 5,500 డ్రోన్లతో ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన అత్యంత అద్భుతంగా అమరావతి ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ బుద్దిని విగ్రహం, జాతీయవాదం గుర్తులను రకరకాల విన్యాసాలతో అహుతులకు, వచ్చిన ప్రజలందరికి ప్రత్యక్షంగా, మీడియా ద్వారా దేశానికి, ప్రపంచానికి తెలియచేశారు.

దేశం లోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ హబ్ కేంద్రం కాబోతుంది. అందుకు కర్నూల్ జిల్లా పారిశ్రామికవాడ లో 300 ఎకరాల స్థలం కేటాయించడం, 35 వేల డ్రోన్ పైలెట్ల ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫలితంగా రాజధాని నగరమైన అమరావతి నగరంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రగతిపథంలో పరుగులు తీయనుంది.

రాయలేలిన రతనాలసీమలో ప్రపంచంలోనే ప్రజలందరూ కొలిచే ఏడుకొండలవాడు శ్రీవేంకటేశ్వరుడు మన కొంగు బంగారం ఎలాగూ వెలుగొందు తున్నాడు.వారి కరుణా కటాక్షలు ప్రపంచంనికి నిండుగా ఉన్నాయి. వారి దయ వల్లే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది.

ఈ అభివృద్ధి అంతా కేంద్రంలో నిజాయితీ కలిగిన ఎన్డీఏ ప్రభుత్వం వల్ల! రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టువిటీ,హైవే కనెక్టువిటీ ఎయిర్ కనెక్టివిటీ జరుగుతూ రాష్ట్రం అడిగిన నిధులను, అనుమతులను మంజూరు చేస్తూ, అడిగిన ప్రాజెక్టులను ఇస్తూ ఎక్కడికక్కడ చెక్ చేస్తూ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుంది.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
7386128877

LEAVE A RESPONSE