Suryaa.co.in

Andhra Pradesh

లాడ్జిలో ప్రియురాలితో నెల్లూరు ఎంపీడీవో శృంగారం!

– పట్టుకున్న కుటుంబ సభ్యులు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న అధికారి ఒకరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్ళారు. అక్కడ అధికారికి ఏఎన్ఎంతో పరిచయo ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన తన కుటుంబానికి దూరమై, భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు.

ఈ పరిణామంతో కుటుంబీకులు ఆయన కదలికలపై నిఘా పెట్టి, ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు లోని ఒక లాడ్జిలో ఉన్నట్టు గుర్తించి, భార్య, కుమార్తె, కుమారుడు అక్కడికి చేరుకున్నారు. ఎంపీడీవో ను ప్రియురాలి సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఒంగోలు రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, అందరినీ స్టేషన్ కి తీసుకువెళ్ళారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించివేశారు.

LEAVE A RESPONSE